OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలను చూడటానికి మన ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ బ్యాంక్ దోపిడీతో మొదలౌతుంది. ఈ సినిమా చివరివరకూ చాలా క్రేజీ గా సాగిపోతుంది. ఇటువంటి స్టోరీలు చాలానే వచ్చినా, ఈ మూవీ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మంచి ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే, ఈ థ్రిల్లర్ మూవీపై ఓ లుక్ వేయండి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ అమెరికన్ హీస్ట్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఇన్‌సైడ్ మ్యాన్’ (Inside man). ఈ మూవీకి స్పైక్ లీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్టోరీ ఒక బ్యాంక్ దోపిడీ చుట్టూ తిరుగుతుంది. ఇందులో డెంజెల్ వాషింగ్టన్, క్లైవ్ ఓవెన్, మడేలిన్ వైట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
న్యూయార్క్ లోని మాన్‌హట్టన్ ట్రస్ట్ బ్యాంక్‌లో డాల్టన్ రస్సెల్ నేతృత్వంలోని ఒక బృందం, పక్కా ప్లాన్ తో దోపిడీకి సిద్ధమవుతుంది. మొదటగా వాళ్ళు బ్యాంక్ ను స్వాధీనం చేసుకుని, కస్టమర్లు, సిబ్బందిని బందీలుగా చేస్తారు. అయితే ఈ దోపిడీ సాధారణమైనది కాదు. డాల్టన్ లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే కాదు, బ్యాంక్ వ్యవస్థాపకుడు ఆర్థర్ కేస్ ఒక సేఫ్ డిపాజిట్ లాకర్ లో దాచిన రహస్య సమాచారం కోసం జరుగుతుంది. డిటెక్టివ్ కీత్ ఫ్రేజియర్ ఆ బ్యాంక్ కు వచ్చి, బందీలను రక్షించేందుకు డాల్టన్ తో చర్చలు జరుపుతాడు. అదే సమయంలో ఆర్థర్ తన రహస్యాలు బయట పడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు.
Read Also : వందేళ్ల వయసులో భార్యమీద అనుమానం… విడాకుల కోసం కోర్టు మెట్లెక్కే వృద్ధుడు… ఈ మలయాళం మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?
డాల్టన్ తన బృందంతో కలిసి బందీలను గందరగోళంలో ఉంచడానికి, వారందరినీ ఒకే రకమైన దుస్తులు ధరించమని ఆదేశిస్తాడు. దీని వల్ల పోలీసులకు దొంగలను గుర్తించడం కష్టమవుతుంది. డాల్టన్ తన ప్లాన్ ను విజయవంతంగా పూర్తి చేసి, బ్యాంక్ నుండి ఎవరూ గుర్తించకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే వీళ్ళను పట్టుకోవడానికి, బ్యాంక్ చుట్టూ పోలీసులు రౌండప్ చేస్తారు. చివరికి డాల్టన్ బ్యాంక్ దోపిడీ చేసి తప్పించుకుంటాడా ? ఆర్థర్ బ్యాంక్ లాకర్ లో ఉంచిన రహస్యం ఏమిటి ? కీత్ ఫ్రేజియర్ ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ అమెరికన్ హీస్ట్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.