Nayanthara Vs Trisha..ఏ రంగంలో అయినా ఇద్దరి మధ్య పోటీ అనేది ఉంటుంది.అలా సినీ రంగంలో కూడా డైరెక్టర్ల మధ్య,నిర్మాతల మధ్య, హీరోల మధ్య, హీరోయిన్ల మధ్య కూడా పోటీతత్వం ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది హీరో – హీరోయిన్ల మధ్య చిన్నపాటి గొడవలు, మనస్పర్ధలు కూడా ఉంటాయి. అయితే ఎన్ని గొడవలు ఉన్నా సరే ఎక్కడైనా ఫంక్షన్లో కనిపిస్తే ఓ చిన్న స్మైల్ ఇచ్చి హగ్ చేసుకోవడం ఇండస్ట్రీలో అలవాటే. అలా మన సౌత్ ఇండస్ట్రీలో గొడవలు పడ్డ హీరోయిన్లలో నయనతార – త్రిష (Nayanthara-Trisha) కూడా ఉంటారు. వీరిద్దరి మధ్య అప్పట్లో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమననేంతలా.. ఉప్పు – నిప్పులా ఉండేవారు. అయితే అలాంటిది రీసెంట్గా వీరు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు అని, మనసు విప్పి మాట్లాడుకొని ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడల్ని పక్కన పెట్టారు. కానీ తాజాగా మళ్లీ కోలీవుడ్ లో వీరి మధ్య మళ్లీ గొడవ స్టార్ట్ అయింది. మరి ఇంతకీ త్రిష – నయనతార మధ్య మళ్లీ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూద్దాం..
త్రిష – నయనతార మధ్య మళ్లీ వార్ మొదలు..
త్రిష – నయనతార మధ్య గొడవ స్టార్ట్ అయింది థగ్ లైఫ్ మూవీ(Thug Life Movie)తో. అయితే వీరిద్దరి మధ్య ప్రత్యక్షంగా గొడవ జరగకపోయినప్పటికీ అభిమానులే వీరి మధ్య పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.సోషల్ మీడియాలో కొంతమంది పుల్లలు పెట్టే బ్యాచ్ ఉంటుంది. అలా తాజాగా నయనతార,త్రిష మధ్య కూడా ఈ బ్యాచ్ పుల్లలు పెట్టేసింది. అదేంటంటే రీసెంట్ గా కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన థగ్ లైఫ్ మూవీలో త్రిష పోషించిన పాత్ర అస్సలు బాలేదని, అసలు త్రిష ఈ పాత్రని ఎంచుకునేటప్పుడు కాస్త ఆలోచించి ఉండాల్సింది అని, ఎంతో మంది ఈమె అభిమానులే పెదవి విరిచారు.అయితే ఈ పాత్ర ఎంచుకున్నందుకు త్రిష(Trisha)కూడా సినిమా విడుదలయ్యాక బాధపడిందనే వార్తలు వినిపించాయి. అయితే ఇలాంటి తరుణంలో ఓ రూమర్ కోలీవులో వైరల్ అవుతుంది..
also read: Big TV Kissik Talks: కేటీఆర్, రేవంత్ రెడ్డి.. పదవి మాత్రమే ముఖ్యమంటున్న గంగవ్వ!
థగ్ లైఫ్ తోనే అసలు చిక్కు..
అదేంటంటే కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీలో త్రిష పోషించిన పాత్ర మొదట నయనతారకే వచ్చిందని, కానీ సినిమాలో ఈ పాత్రకి కాస్త నెగిటివ్ షేడ్స్ ఉండడంతో ఈ పాత్రలో నటిస్తే తన కెరీర్ కి మైనస్ అవుతుందనే ఉద్దేశంతో నయనతార (Nayanthara)ఈ మూవీ ని రిజెక్ట్ చేసిందట. అయితే నయనతార రిజెక్ట్ చేయడంతో ఇందులోకి త్రిషని తీసుకున్నారని, నయనతార రిజెక్ట్ చేసిన సినిమాలో త్రిష నటించి డిజాస్టర్ అందుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది.. దీంతో మళ్లీ త్రిష నయనతార అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది.. అలా కలిసిపోయిన నయనతార – త్రిష మధ్య పుల్లలు పెట్టే బ్యాచ్ మళ్ళీ వివాదానికి తెర లేపింది. మరి దీనిపై ఈ స్టార్ హీరోయిన్స్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.