నయనతార (Nayanthara).. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ దక్కించుకున్న ఈమె.. తెలుగు, తమిళ్ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్టు లేకుండా వచ్చి రెక్కల కష్టం పై పాన్ ఇండియా హోదాను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె కష్టాన్ని గుర్తించింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. ఈ మేరకు ఈమె బయోపిక్ ను ఆధారంగా తీసుకొని డాక్యుమెంటరీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే డాక్యుమెంటరీని తాజాగా నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నో విషయాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఈ డాక్యుమెంటరీని రూపొందించే సమయంలో హీరో ధనుష్ (Dhanush) చేసిన రచ్చ అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. మూడు సెకండ్ల నిడివి ఉన్న క్లిప్ కోసం రూ.10 కోట్లు నష్టపరిహారం కావాలని ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. అలాగే నయనతార కూడా ఏకంగా ధనుష్ ను టార్గెట్ చేస్తూ మీరు చేసిన పని ఇండస్ట్రీ కే సిగ్గుచేటు అన్నట్టుగా కామెంట్లు చేసింది.
నేను పుట్టినరోజు.. కొత్త మూవీ నుండి అప్డేట్స్..
ఇలా గొడవ ఒకవైపు జరుగుతుండగానే.. మరొకవైపు తాను నటించిన ‘రక్కయి’ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసింది. ఇక ఈరోజు నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈమె కొత్త సినిమా నుండీ అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే రక్కయి అనే టైటిల్ తో లేడీ ఓరియంటెడ్ మూవీ గా వస్తున్న ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ సెంథిల్ నల్లస్వామి(Senthil Nallaswamy) దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ వర్క్ ఇండియా, డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
టీజర్ లో అదరగొట్టిన నయన్..
ఇకపోతే తాజాగా టీజర్ విడుదల చేయగా.. సినిమాలో నయనతార తల్లి పాత్రలో కనిపించనున్నట్లు చూపించారు. తన బిడ్డ కోసం చేసే పోరాటమే ఈ సినిమా. ఇందులో నయనతార యాక్టింగ్, పోరాటం భయంకరంగా ఉండబోతుందనేది టీజర్ లోనే చూపించారు. ఇండియా లెవెల్లో ఈ సినిమా రాబోతోంది. ఇక తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.
ధనుష్ కి మాస్ వార్నింగ్..
ఇందులో నయనతార వేట కొడవళ్లతో వేటాడడం నిజంగా గూస్ బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా బలమైన పురుషులు తనపై పోటీకి వచ్చినప్పుడు.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా రాణి రుద్రమదేవి రేంజ్ లో విరుచుకు పడిపోయింది. వేట కొడవళ్లతో వేటాడుతూ కళ్ళలోనే ఉగ్రరూపాన్ని చూపించింది. ఇప్పుడు ఈ టీజర్ వైరల్ గా మారడంతో ఇది ధనుష్ కి మాస్ వార్నింగ్ అంటూ నయనతార అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి తన అద్భుతమైన నటనతో లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకుంది నయనతార .ఇలాంటి సమయంలో డాక్యుమెంటరీ రూపొందిస్తున్నప్పుడు సినీ ఇండస్ట్రీలు మొత్తం సహాయ పడ్డాయి. కానీ ధనుష్ మాత్రం వ్యతిరేకించాడు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి టీజర్ ను విడుదల చేసి ఆయనకు గట్టి షాక్ ఇచ్చిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నయనతార తన నటనతో మరోసారి మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు.