Neha Shetty In OG Movie: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా అనే సినిమాలో ఆకాష్ పూరి సరసన నటించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ ను చోటుచేసుకుంది. వాస్తవానికి ఈ సినిమా చూడడానికి బాగానే ఉంటుంది.చాలా రోజుల తర్వాత పూరి జగన్నాధ్ అసలైన స్టోరీ రాశాడు.ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుంది అని చాలామంది ఊహించారు. అయితే ఎవరూ ఊహించని డిజాస్టర్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. చాలామందికి ఈ సినిమా రిలీజ్ అయింది అని కూడా తెలియదు. ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులుకు ఎక్కలేదు. ఇకపోతే ఈ సినిమా తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసింది నేహశెట్టి.
సిద్దు జొన్నలగడ్డ సరసన చేసిన డిజే టిల్లు సినిమా సిద్దుకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. జోష్,ఆరెంజ్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. గుంటూరు టాకీ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. అయితే కేవలం నటుడుగానే కాకుండా రైటర్ గా కూడా తన టాలెంట్ బయట పెడితే వచ్చాడు సిద్దు. సిద్దు ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేసినా కూడా, సిద్దుకు బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే డీజే టిల్లు అని చెప్పాలి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సిద్దు సరసన రాధిక అనే పాత్రలో నేహా కనిపించింది. ఈ సినిమాతోనే నేహా కి సరైన బ్రేక్ వచ్చింది.
ఈ సినిమా తర్వాత నేహా ఎక్కడ కనిపించినా కూడా రాధిక రాధికా అనడం మొదలుపెట్టారు. చివరిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో కనిపించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ను సాధించలేకపోయింది. ప్రస్తుతం వస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ జి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నేహశెట్టి కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలియగానే సుజిత్ ఏం ప్లాన్ చేశాడో అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్ విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో ఓజీ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. స్వతహాగా దర్శకుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవడంతో పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తాడు అని క్యూరియాసిటీతో చాలామంది ఎదురుచూస్తున్నారు. ఓజి లో నేహా శెట్టి మాత్రమే కాకుండా హరిహర వీరమల్లు సినిమాలో అనసూయ కూడా ఒక స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో వీళ్లకు సరిపడా సాంగ్స్ ఎలా ప్లాన్ చేశారో అని కొంతమంది పవర్ స్టార్ అభిమానులు ట్రోల్ కూడా చేస్తున్నారు.
Also Read : Naga Chaitanya-Shobhita : మొదట ఎవరు ప్రపోజ్ చేశారు..? శోభిత ఆన్సర్ ఏంటంటే..?