Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారం చర్చకు దారితీసింది. రాష్ట్రంలో రహదారుల అంశం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీరియస్‌గా మాట్లాడుతున్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తాను కూర్చొన్న సీటులో నుంచి లేచి డ్రంకెన్ డ్రైవ్ గురించి మాట్లాడారు.
సభలో కొంతమంది సభ్యులు పొద్దున్నే తాగి సభకు వస్తున్నారని అన్నారు. కొంతమంది సోయి లేకుండా మాట్లాడుతున్నారని, అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు పెడతారా? అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన ఈ వ్యాఖ్యలపై సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే కౌంటరిచ్చారు. బహుశా హరీష్‌రావు.. ప్రతిపక్ష నేత తాగి ఫాంహౌస్‌లో పడుకుని ఉండవచ్చని అన్నారు. దీంతో సభలో అధికార-విపక్షాల మధ్య చిన్న గందరగోళం చోటు చేసుకుంది. అగ్గిపెట్టి హరీష్‌రావు ఇలా మాట్లాడడం సరికాదని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు.
ఈలోగా స్పీకర్ జోక్యం చేసుకుని ఇరుపక్షాలకు సర్ధిచెప్పేప్రయత్నం చేశారు. చివరకు సభ్యులు సైలెంట్ కావడంతో సభలో మళ్లీ రహదారుల అంశంపై చర్చ మొదలైంది. అధికార పార్టీని ఇరుకించబోయే అడ్డంగా బీఆర్ఎస్ ఇరుక్కుందని ఎమ్మెల్యేలు లాబీల్లో చెప్పుకోవడం కొసమెరుపు .
ALSO READ: గుంతల రోడ్లపై చర్చ.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రూ. 700 కోట్లతో రోడ్డు
ప్రతిపక్ష నేత తాగి ఫాంహౌస్‌లో పడుకున్నాడు: కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య pic.twitter.com/adDx7Gh3X2
— BIG TV Breaking News (@bigtvtelugu) December 18, 2024
అసెంబ్లీకి వచ్చే సభ్యులకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలి..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
కొంతమంది సోయి లేకుండా మాట్లాడుతున్నారన్న హరీశ్ రావు pic.twitter.com/qhuN0cm8Q5
— BIG TV Breaking News (@bigtvtelugu) December 18, 2024