E-Paper
Advertisement

Bigg Boss 8 : షాకింగ్ ఎలిమినేషన్… మెడ పట్టి గెంటక ముందే బయటపడ్డ కంటెస్టెంట్

Bigg Boss 8 : షాకింగ్ ఎలిమినేషన్… మెడ పట్టి గెంటక ముందే బయటపడ్డ కంటెస్టెంట్
Advertisement

Bigg Boss 8 : బిగ్ బాస్ 8 తెలుగు (Bigg Boss 8 Telugu) ఏడవ వారం వీకెండ్ వచ్చేసింది. ఈవా రం నామినేషన్లలో 9 మంది కంటెస్టెంట్స్ ఉండగా, ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఆ కంటెస్టెంట్ ఎవరో తెలుసుకుందాం పదండి.

ఈ వారం నామినేషన్ల లిస్ట్

Advertisement

వైల్డ్ కార్డు ఎంట్రీల తర్వాత కూడా ఈ సీజన్ (Bigg Boss 8 Telugu) అంతే చప్పగా నడుస్తోంది అనే విమర్శల మధ్య సీజన్ 8 ఏడో వారం ముగింపు దశకు వచ్చింది. ఇక ప్రతివారం వీకెండ్ నాగార్జున చేసే సందడి కోసం, హౌస్ మేట్స్ కు  వేసే మొట్టికాయల కోసం చాలామంది బుల్లితెర ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి ఆ పర్సన్ ఎవరు? వెళ్లే ముందు ఏం చెప్పబోతున్నారు ? అనే  ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తాయి. తాజాగా ఏడవ వారం నామినేషన్ లో గౌతమ్, పృథ్వీ, నిఖిల్, యష్మీ, తేజ, మణికంఠ, నబిల్, హరితేజ, ప్రేరణ ఉన్నారు.

అయితే వీళ్ళందర్లోకెల్లా టాప్ ప్లేస్ లో ఓటింగ్ పరంగా చూస్తే నిఖిల్ ఉన్నారు. ఇక ఓరుగల్లు పోరడు నబిల్ కు ఓటింగ్ పరంగా ఎలాంటి ఢోకా లేదు. అలాగే ప్రేరణ, గౌతమ్, యష్మిలకు కూడా బుల్లితెర ప్రేక్షకుల సపోర్ట్ గట్టిగానే ఉంది. ఇక ఈ వీకెండ్ నామినేట్ అయిన కంటెస్టెంట్లలో మణికంఠ, పృథ్వీ లీస్ట్ ఓటింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్

ఈవారం నామినేషన్లలో ఉన్న వారిలో తక్కువ ఓటింగ్ వచ్చిన చివరి ముగ్గురిలో పృథ్వి, తేజ, మణికంఠ ఉండగా, తేజ లేదా పృథ్వీ ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని టాక్ నడిచింది. ప్రతి వారం లీస్ట్ ఓటింగ్ తో చివరిదాకా వెళ్తున్న పృథ్వి ఈసారి బయటకు వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ వారం నాగ మణికంఠ (Naga Manikanta) ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మణికంఠ తనకు తానే స్వయంగా హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు.

అయితే మణికంఠ (Naga Manikanta) నిజానికి ఈవారం పెద్దగా ఆడలేదు. అసలు టాస్క్ స్టార్ట్ కాకముందే ఈ ఫిజికల్ టాస్క్ లో ‘నా బొక్కలు విరిగితే, ఫ్రాక్చర్ అయితే కష్టం.. నాకు ఫ్యామిలీ ఉంది, నేను అలా బయటకు వెళ్ళలేను. నేను ఆడలేను’ అంటూ చేతులెత్తేశాడు. అయితే తను ఫిజికల్ గా, మెంటల్ గా వీక్ కాదు కాదు అంటూనే ఇలా వెనకడుగు వేయడం, తనకు తానే వీక్ అని ఒప్పేసుకోవడం ప్రేక్షకులకు నచ్చినట్టుగా లేదు.

ఇప్పటికే సండేకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తికాగా మణికంఠ (Naga Manikanta) అందులో తనకు తానుగా వెళ్లిపోతానని నాగార్జునను అడిగాడని టాక్ నడుస్తోంది. దీంతో ఈ వార్త విన్న కొంతమంది నెటిజన్లు మణికంఠ బిగ్ బాస్ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటిస్తే వాళ్ళు హౌస్ నుంచి గెంటేసినట్టు. అందుకే వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తనకు తానే బయటపడ్డాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషనే.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×