Daaku Maharaaj : నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj). సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీకి బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కీలక పాత్ర పోషించడంతో పాటు స్పెషల్ సాంగ్ లో కూడా మెరిసింది బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెల (Urvashi Rautela). కానీ తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతుండగా, సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం ఆమె సీన్స్ ని డిలీట్ చేసినట్టు టాక్ నడుస్తోంది.
రోలెక్స్ దీదీ ఎక్కడ?
రీసెంట్ గా ‘డాకు మహారాజ్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతుందని ఆ పోస్టర్లో వెల్లడించారు. అయితే పోస్టర్ లోనే ఊర్వశి రౌతెల మిస్ అవ్వడం చర్చకు దారి తీసింది. ఆ పోస్టర్లో నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ వంటి సినిమాలో మెయిన్ లీడ్స్ పోషించిన నటీనటులు అందరూ ఉన్నారు. కానీ ఊర్వశి మాత్రం కనిపించలేదు. దీంతో రోలెక్స్ దీదీ ఎక్కడ? అంటూ నెట్ ఫ్లిక్స్ ను ప్రశ్నించడం మొదలు పెట్టారు నెటిజెన్లు.
ఈ మూవీలో ఊర్వశీ రౌతెల సీన్స్ ని డిలీట్ చేశారని, అందుకే పోస్టర్ లో సైతం ఆమె లేకుండా చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్స్ ఆ తర్వాత సినిమాలోని పాత్రలకు సంబంధించి స్పెషల్ పోస్టర్లను రిలీజ్ చేసింది. అందులో రెండు చోట్ల ఊర్వశి రౌతెల కనిపించడంతో ఆమె అభిమానులు కూల్ అయ్యారు. నెట్ ఫ్లిక్స్ తాము చేసిన తప్పును గ్రహించి, స్పెషల్ పోస్టర్ ద్వారా ఆ తప్పును సరిదిద్దుకున్నప్పటికీ నెటిజన్లు మాత్రం వదలట్లేదు. అందులో భాగంగానే ‘డాకు మహారాజ్’ ఓటీటీ వెర్షన్ లో ఊర్వశి రోల్ ను లేకుండా చేశారని కామెంట్స్ చేస్తున్నారు.
‘డాకు మహారాజ్’ వల్ల విమర్శలు
ఇదిలా ఉండగా ‘డాకు మహారాజ్’ మూవీ 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా దాదాపు రూ. 105 కోట్ల భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. అయితే చిత్రం బృందం కంటే ఎక్కువగా ఊర్వశీ రౌతెల ఈ మూవీని ప్రమోట్ చేసింది. అదికూడా ట్రోలింగ్ ద్వారా. ముందుగా ఈ సినిమాలోని ‘దబిడి దిబిడి’ సాంగ్ లో అసభ్యకరమైన స్టెప్ వల్ల మూవీపై అలాగే బాలయ్య, ఊర్వశి, కొరియోగ్రాఫర్ పై ట్రోలింగ్ నడిచింది. ఇక ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురైన సంఘటనపై ఊర్వశి స్పందించినప్పుడు, ఆమె తన మూవీని ప్రమోట్ చేసుకోవడం, తన లగ్జరీ గురించి ప్రస్తావించడం విమర్శలకు దారి తీసింది. ఊర్వశి దాడిని ఖండిస్తూనే వజ్రాలు పొదిగిన తన గడియారాన్ని ప్రదర్శించి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అంతేకాకుండా మరో హీరోయిన్ పేరును ప్రస్తావిస్తూ తన మూవీ 100 కోట్లు కొల్లగొట్టిందంటూ మురిసిపోయింది.