Jaat Movie: బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటించిన చిత్రం జాట్. తెలుగు స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ బాలయ్య లా సన్నీ డియోల్ యాక్షన్ సీక్వెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రెజీనా కాసాండ్రా, రణదీప్ హూడా, ఆయేషా ఖాన్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు.
మొదట ఈ సినిమా గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ కోసం రాసుకున్నాడట. కానీ, చివరకు ఈ కథ సన్నీ డియోల్ వద్దకు చేరింది. అప్పటికే గదర్ 2 తో మంచి విజయాన్ని అందుకున్న సన్నీ.. వరుసగా జాట్ తో మరో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఏప్రిల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు ఓటీటీలో రాలేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు జాట్ ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
జూన్ 6 నుంచి జాట్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. అయితే ఇక్కడ కూడా కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ కానుందా అంటే.. అన్ని భాషల్లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. థియేటర్ లో జాట్ సినిమా తెలుగు భాషలో రిలీజ్ అవుతుంది అనుకోని తెలుగు అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ, తెలుగులోనే కాదు వేరే భాషలో కూడా రిలీజ్ కాలేదు. ఇక ఇప్పుడు అన్ని భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మరి థియేటర్ లో మంచి హిట్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.