Pusha 2: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పుష్ప 2. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇదివరకే వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు దర్శకుడు సుకుమార్ హీరో అల్లు అర్జున్. ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. కేవలం కలెక్షన్స్ మాత్రమే కాకుండా ఇప్పటివరకు ఏ తెలుగు నటుడికి రానటువంటి నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్ కు ఈ సినిమాతో వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ కి కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ట్రైలర్ అప్డేట్ ఎప్పుడని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే కొంతమంది నెటిజెన్స్ చిత్ర యూనిట్ ని బ్లాక్ మెయిల్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఏకంగా ఒక అభిమాని ట్రైలర్ అప్డేట్ ఇస్తావా లేకపోతే సూసైడ్ చేసుకోవాలో అంటూ ట్విట్టర్ వేదిక పోస్ట్ చేశాడు. దీనికి ఏకంగా అల్లు అర్జున్ టీం కూడా స్పందించింది. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అంటూ రియాక్ట్ అయ్యారు. ఇకపోతే పుష్ప సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్డేట్ ఈరోజు అఫీషియల్ పోస్టర్ తో పాటు రిలీజ్ చేయనున్నట్లు కూడా తెలిపారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా ఉండబోతుంది అని సినిమా ప్రముఖులు అంచనాలు వేస్తున్నారు. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో దానిని మించి ఈ సినిమా ఉండబోతుంది అని చిత్ర యూనిట్ కూడా చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చింది.
Also Read : Director Karuna Kumar : వరుణ్ తేజ్ ఏ రోజు మిమ్మల్ని మోసం చేయలేదు, ఆయనతో చేసిన దర్శకనిర్మాతలే అలా చేసారు
ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు సుకుమార్ చేసిన ప్రతి సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు కూడా మంచి రెస్పాన్స్ సాధించాయి. అయితే దేవిశ్రీప్రసాద్ తో పాటు ఈ సినిమాకి మరి కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నారు అని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. కానీ దీని గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ నవంబర్ 19తో పూర్తి కానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఈ సాంగ్లో శ్రీ లీలా కనిపించబోతుంది. శ్రీ లీలా ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు శ్రీ లీలా లో ఉన్న ప్లస్ పాయింట్ డాన్స్. ఇక సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందని కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
Motham pothaaaaaru….Thagalabadipoddi. Can’t wait to see the mentallll massssss high of fans once the trailer releases. #Pushpa2TheRuleTrailer pic.twitter.com/UIJhAigXnw
— Sarath Chandra Naidu (@imsarathchandra) November 10, 2024