BigTV English

Director Karuna Kumar : వరుణ్ తేజ్ ఏ రోజు మిమ్మల్ని మోసం చేయలేదు, ఆయనతో చేసిన దర్శకనిర్మాతలే అలా చేసారు

Director Karuna Kumar : వరుణ్ తేజ్ ఏ రోజు మిమ్మల్ని మోసం చేయలేదు, ఆయనతో చేసిన దర్శకనిర్మాతలే అలా చేసారు

Director Karuna Kumar : ముకుంద సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్ తేజ్. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. అందరి హీరోలులా కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా సినిమాలు కాన్సెప్ట్ బేస్ సినిమాలు ఎంచుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్ళాడు. వరుణ్ తేజ్ కెరియర్ లో మంచి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. అలానే కాన్సెప్ట్ ను నమ్మి చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతం కరుణ్ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే సినిమాను చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ సినిమా ప్రీ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్.


ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈవెంట్ లో దర్శకుడు కరుణ్ కుమార్ మాట్లాడుతూ.. “వరుణ్ తేజ్ ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయలేదు, వరుణ్ తేజ్ సినిమాలు మిమ్మల్ని నిరాశపరిచిన కూడా దానిలో వరుణ్ తేజ్ తప్పేమీ లేదు. ఆ కథను చెప్పిన దర్శకుడు దానిని సరిగ్గా తీయలేకపోవచ్చు. లేదంటే ఆ కథను నిర్మించిన నిర్మాత సరైన బడ్జెట్ పెట్టి ఉండకపోవచ్చు అంతే తప్ప వరుణ్ తేజ్ ఎఫర్ట్స్ లో ఏమాత్రం లోపం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మామూలుగా వరుణ్ కి ఓసిడి ఉంది. కానీ ఈ సినిమా కోసం నేను ఏం చెప్తే అది చేశాడు. కింద కూర్చోమంటే కూర్చున్నాడు. నాకు షూటింగ్ చేస్తున్న రెండో రోజుకి వరుణ్ తేజ్ ఏంటో అర్థం అయిపోయింది” అంటూ ప్రశంసించాడు కరుణ్ కుమార్.

Also Read: Ss Thaman : సైలెంట్ గా గేమ్ చేంజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడి నుంచి లేపుకొచ్చాడు


ఇక మట్కా సినిమా విషయానికి వస్తే ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న 3వ సినిమా ఇది. మొదటి వచ్చిన పలాస సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం వస్తున్న మట్కా సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రీసెంట్ టైమ్స్ లో వరుణ్ తేజ్ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ అవుతుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ మాస్ కమర్షియల్ హీరో అయిపోతాడు అంటూ నిర్మాత రామ్ తల్లూరి తన స్పీచ్ లో చెప్పుకొచ్చాడు. మట్కా అంటే ఇది ఒక గేమ్. అప్పట్లో దీని గురించి తెలియని వాళ్ళు లేరు అని చెప్పాలి. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను చేసినట్లు దర్శకుడు కరుణ్ కుమార్ ఒక సందర్భంలో తెలిపారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×