Rashmika Mandanna: ‘పుష్ప 2’ పెయిడ్ ప్రీమియర్స్ వల్ల ఇన్ని దారుణాలు జరుగుతాయని ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పటివరకు ఎన్నో పాన్ ఇండియా సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ జరిగాయి. అందులో చాలావాటికి హీరోలు కూడా వచ్చారు. కానీ ‘పుష్ప 2’కు జరిగినట్టుగా ముందెప్పుడూ జరగలేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ఫ 2’ ప్రీమియర్స్‌కు అల్లు అర్జున్ రావడం, తనను చూడడానికి ప్రేక్షకులు ఎగబడడం, దానివల్ల తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోవడం.. ఎవరూ ఊహించని విధంగా ఇలా చాలా జరిగిపోయాయి. ఇంత జరుగుతున్నా కూడా ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందనా మాత్రం ఇంకా సైలెంట్‌గా ఉండడానికి కారణమేంటి.?
అరెస్ట్‌పై రియాక్షన్
‘పుష్ఫ 2’ (Pushpa 2) పెయిడ్ ప్రీమియర్స్ చూడడానికి అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందనా కూడా ఆరోజు సంధ్య థియేటర్‌కు వెళ్లింది. కానీ తను అల్లు అర్జున్ లాగా రోడ్ షో చేయకుండా సైలెంట్‌గా తన సెక్యూరిటీతో కలిసి థియేటర్ లోపలికి వెళ్లింది. మళ్లీ వారితోనే బయటికి కూడా వచ్చేసింది. అల్లు అర్జున్ రావడం వల్ల బయట తొక్కిసలాట జరిగిన విషయం తనకు ముందే తెలుసా లేదా అన్న విషయం కూడా ఇంకా క్లారిటీ లేదు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినప్పుడు మాత్రం జరిగిన యాక్సిడెంట్ చాలా బాధాకరం అని, కానీ ఆ విషయంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదని ట్వీట్ చేసింది. అంతే ఆ తర్వాత మరోసారి దీని గురించి మాట్లాడలేదు రష్మిక.
Also Read: సీఎం వద్దకు మామ అల్లుళ్ళు
సంబంధం లేదు
ఒకవైపు సంధ్య థియేటర్ ఘటన వల్ల అల్లు అర్జున్ (Allu Arjun) చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నా కూడా రష్మిక మాత్రం ఈ మూవీని నార్త్‌లో ప్రమోట్ చేయడంలో బిజీ అయిపోయింది. ఇప్పటికీ ఎన్నో ప్రముఖ యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అసలు అల్లు అర్జున్ అరెస్ట్ గురించి, తనపై జరుగుతున్న విచారణ గురించి తనకు అస్సలు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. అంతే కాకుండా ప్రేక్షకులకు షాకింగ్ అనిపిస్తున్న మరొక విషయం ఏంటంటే.. తమ మూవీ టీమ్ వెళ్లకపోయింటే శ్రీ తేజ్.. ఆసుపత్రిపాలయ్యేవాడు కాదు. కనీసం శ్రీ తేజ్ గురించి అయినా రష్మిక ఒక్కసారి కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించలేదు.
ఇప్పటికైనా స్పందించు
శ్రీ తేజ్ చికిత్స కోసం, అంతే కాకుండా తన కుటుంబానికి ఆర్థిక సాయంగా ఉండడం కోసం ‘పుష్ప 2’ టీమ్ అంతా విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. బుధవారం శ్రీ తేజ్‌ను చూడడానికి ఆసుపత్రికి వెళ్లారు అల్లు అరవింద్. అదే సమయంలో అల్లు అర్జున్ రూ.1 కోటి, మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు, సుకుమార్ రూ.50 లక్షలు విరాళం ఇస్తున్నట్టుగా ఆయన స్వయంగా ప్రకటించారు. కనీసం ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి కూడా రష్మిక మందనా (Rashmika Mandanna) ముందుకు రాకపోవడం ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా రష్మిక ఏదో ఒక విధంగా స్పందిస్తే బాగుంటుందని ఫీలవుతున్నారు.