BigTV English

Kareena Kapoor: బ్యాన్ చేయాలంటూ డిమాండ్.. కరీనాకపూర్ పై నెటిజన్స్ ఫైర్..!

Kareena Kapoor: బ్యాన్ చేయాలంటూ డిమాండ్.. కరీనాకపూర్ పై నెటిజన్స్ ఫైర్..!

Kareena Kapoor:ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ (Kareena Kapoor) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈమెపై ఇప్పుడు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈమెను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. అసలు విషయంలోకి వెళ్తే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను ఎలాగైనా సరే ముట్ట పెట్టాలని దేశ ప్రజలు కోరుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఈ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.ఇప్పటికే సింధు జలాలను పాకిస్తాన్ కి వెళ్లకుండా నిలిపివేసింది. అలాగే దేశంలో ఉన్న పాకిస్థానీయులు వెంటనే భారత్ వదిలి వెళ్ళిపోవాలని కూడా ఆదేశించింది.


బాయ్ కాట్ కరీనాకపూర్..

అటు పాకిస్తాన్, ఇటు భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా.. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవ్వడమే కారణం.. అసలు విషయంలోకి వెళ్తే.. ఒక కార్యక్రమము నిమిత్తం కరీనాకపూర్ దుబాయ్ వెళ్లగా.. అక్కడ ప్రముఖ పాకిస్తానీ ఫ్యాషన్ డిజైనర్ ఫరాజ్ మన్నన్ ను కలిసి ఫోటోలు దిగింది.ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది కూడా. దీంతో అవి క్షణాల్లో వైరల్ అయిపోయాయి. అందులో కరీనా తెల్లటి కార్సెట్ డ్రెస్ ధరించగా, ఫరాజ్ నల్లటి టీషర్ట్ ధరించి కనిపించారు. దీంతో అభిమానులు కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆమెను ఇండియా నుంచి పంపించేయండి.. ఆమె మనకొద్దు.. ఇలాంటి వాళ్లని బహిష్కరించాలి.. కరీనా ఇలా చేయడం సిగ్గు చేటుగా అనిపించడం లేదా.. బాయికాట్ బాలీవుడ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కూడా చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.


పాకిస్తాన్ నటులకు చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్..

మొత్తానికైతే కరీనా కపూర్ తెలిసి చేసిందా..? తెలియక చేసిందా తెలియదు కానీ ఇప్పుడు ఈమె చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో బాయ్ కాట్ విధించింది అని చెప్పవచ్చు. ఇక పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తానీ నటుడైన ఫహాద్ ఖాన్ నటించిన ‘అబీర్ గులాల్’ సినిమాని ఇండియాలో విడుదల చేయకుండా నిషేధించారు. అలాగే సర్దార్ జీ 3 సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన హనియా అమీర్ ను కూడా ఈ ప్రాజెక్టు నుంచి తొలగించడం జరిగింది. ఇప్పుడు కరీనా పాకిస్తానీ డిజైనర్ తో ఫోజులు ఇవ్వడం చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరీనాకపూర్ కెరియర్..

కరీనాకపూర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుగా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా రొమాంటిక్, కామెడీ చిత్రాలు మొదలు క్రైమ్ డ్రామా వరకు ఎన్నో రకాల సినిమాలు చేసిన ఈమె.. ఆ సినిమాలతో ఊహించని అవార్డులు కూడా అందుకుంది..ఇప్పటివరకు ఆరు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్న ఈమె.. ఎక్కువ పారితోషకం తీసుకునే నటీనటులలో ఒకరిగా పేరు సొంతం చేసుకుంది. ఈమె ఎవరో కాదు నటులు రణధీర్ కపూర్, భబితల కుమార్తె..ఈమె చెల్లెలు కరిష్మా కపూర్ ఇండస్ట్రీలో చలామణి అవుతున్న విషయం తెలిసిందే.

also read:Bahubali 2: ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలివే.. మీరు గెస్ చేయగలరా..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×