Mark Shankar:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రెండవ కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar pawanovich) ఇటీవల సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురై కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స పొంది.. ఇటీవలే హైదరాబాద్ కి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు తన కొడుకు ఆరోగ్యం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. దేవుడి దయతో మార్క్ శంకర్ కోలుకుంటున్నారు అంటూ తెలిపారు. దీంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ తన కొడుకు ఆరోగ్యం గురించి మరోసారి మాట్లాడిన మాటలు అభిమానులలో ఆందోళనలను కలిగిస్తున్నాయి.
అలాంటి పీడకలలతో మార్క్ బాధపడుతున్నారు – పవన్ కళ్యాణ్
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..” ఇటీవల నా కొడుకు సింగపూర్ లోని స్కూల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో గాయపడ్డారు. అందులో ఒక బాలుడు చనిపోగా, ఒకరికి కాళ్ల, చేతులు కాలిపోయాయి. నా కొడుకు ఊపిరితిత్తులలోకి పొగ వెళ్ళింది. ఆ సంఘటన తర్వాత నా కొడుక్కి అర్ధరాత్రి పూట ఆ మేడ మీద నుండి పడిపోతున్నట్టు పీడకలలు వస్తున్నాయి. దీంతో సైకాలజిస్ట్ దగ్గర చూపిస్తున్నాము”.. అంటూ తెలిపారు. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ తన కొడుకు ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పి అభిమానులను ఆందోళనకు గురి చేశారు. ఇక మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
ఇక పవన్ కళ్యాణ్ ఒకవైపు ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు లైన్లో ఉన్నాయి. ముందుగా హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140 కోట్లు జరిగింది. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి టేక్ ఓవర్ చేశారు. కానీ ఆయన సినిమా నుండి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ రంగంలోకి దిగారు..ప్రస్తుతం ఈయన దర్శకత్వంలోనే మిగతా సినిమా కూడా పూర్తయింది. ఇక పవన్ కళ్యాణ్ మరో 20 రోజులు ఈ సినిమా కోసం డేట్స్ కేటాయిస్తే.. సినిమాను మే 30వ తేదీలోపు విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయిస్తారా లేక ప్రజల సహాయార్థ నిమిత్తం పర్యటనకే ప్రాధాన్యత ఇస్తారా.. అన్న విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఇంత బిజీ షెడ్యూల్ ని ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.
ALSO READ:Kareena Kapoor: బ్యాన్ చేయాలంటూ డిమాండ్.. కరీనాకపూర్ పై నెటిజన్స్ ఫైర్..!
ALSO READ:Tollywood : 15 ఏళ్లకే జీవితం మొత్తం చూసిన స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్..!