China: అసలే ఎండాకాలం.. చిన్న నిప్పు వచ్చినా రాజేసినా తీవ్రత అస్సలు ఊహించలేము. కేవలం నష్టమేకాదు.. మనుషులు సైతం మృత్యువాట పడుతున్నారు. తాజాగా చైనాలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ రెస్టారెంట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 22 మంది మృత్యువాట పడ్డారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
చైనాలోని లియా వోయాంగ్ సిటీలోని ఓ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 22 మంది మృతి స్పాట్‌లో మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్ ఉన్న భవనంలో ఒక్కసారిగా రెండు, మూడు అంతస్తుల భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఏప్రిల్ నెలలో చైనాలో జరిగిన రెండో అతి పెద్ద అగ్ని ప్రమాదం ఘటన.
ఏప్రిల్ 9న చెంగ్డే నగరంలోని లాంగ్‌హువా కౌంటీలో ఓ నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో జరిగింది. ఆ ఘటనలో 20 మంది మరణించారు. రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో 20 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో నర్సింగ్ హోమ్‌లో 260 మంది వృద్ధులు ఉన్న విషయం తెల్సిందే.
ALSO READ: దాయాది దేశానికి ఊహించని ఎఫెక్ట్, విమానాల తర్వాత నౌకా మార్గం
First images from the restaurant fire 🔥
22 people dead and 3 injured after a #fire broke out at a restaurant near a resettlement housing complex in Liaoyang, #Liaoning Province. The investigation is ongoing. #China #fire pic.twitter.com/WRelu9T8ov
— Nazlı Özdemir (@nazliiozdemr) April 29, 2025