BigTV English

Amazon prime Video: ఏందిరా ఈ దారుణం… ప్రైమ్ కొని ఏం లాభం.. ప్రైమ్ వీడియో పై భారీ విమర్శలు!

Amazon prime Video: ఏందిరా ఈ దారుణం… ప్రైమ్ కొని ఏం లాభం.. ప్రైమ్ వీడియో పై భారీ విమర్శలు!

Amazon prime Video: ఒకప్పుడు సినిమాలు చూడాలి అంటే కేవలం థియేటర్ కి వెళ్లి మాత్రమే మనం సినిమాలు చూసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మనకు నచ్చిన సినిమా ఎప్పుడైనా, మన ఇంట్లోనే చూసే అవకాశం ఉందని చెప్పాలి. ప్రస్తుతం మనకు ఓటీటీలు(Ott) అందుబాటులోకి రావడంతో మనకు నచ్చిన సినిమా వెబ్ సిరీస్ లేదా ఏదైనా షోలు ఇంట్లోనే కూర్చుని మనకు నచ్చిన సమయంలో చూసే అవకాశం ఉంది. అయితే ఇలా ఓటీటీ సంస్థలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం కేవలం తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషలలో ప్రసారమయ్యే సిరీస్, సినిమాలను కూడా చూస్తున్నాము. అయితే వీటిని చూడాలి అంటే కచ్చితంగా మనం మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.. ఇలా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఎన్నో ఓటీటీ సంస్థలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే మనం వీటికి మెంబర్షిప్ తీసుకున్నప్పటికీ కూడా ఏదైనా ఒక సినిమా చూస్తున్నప్పుడు లేదా సిరీస్ చూస్తున్నప్పుడు కచ్చితంగా మధ్యలో మనకు యాడ్స్ (Ads)రావడం అనేది జరుగుతుంది.


డబ్బులు కట్టిన ప్రయోజనం లేదా..

ఇలా యాడ్స్ వద్దనుకుంటే అదనంగా మరికొన్ని డబ్బులు చెల్లించి ఈ యాడ్స్ లేకుండా నిరంతరాయంగా సినిమా లేదా సిరీస్ చూడవచ్చు. అయితే ఈ విషయంలో మాత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ఎంతో దారుణంగా ఉందని చెప్పాలి. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నవారు ఇందులో చూస్తున్న సినిమాలు వెబ్ సిరీస్ లకు యాడ్స్ రాకుండా ఉండడం కోసం అదనంగా రూ. 699 చెల్లిస్తున్నప్పటికీ కూడా దారుణంగా యాడ్స్ రావడంతో తీవ్రస్థాయిలో అమెజాన్ ప్రైమ్ పై విమర్శలు వస్తున్నాయి.


సహనానికి పరీక్ష…

ఇండియాలో జూన్ 17 నుంచి యాడ్స్ లేకుండా చూసే వెసులుబాటును అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఒక గంట పాటు సినిమా లేదా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సమయంలో యాడ్స్ ఏకంగా ఆరు నిమిషాల పాటు రావటంతో ప్రేక్షకులు కూడా ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. యాడ్స్ రాకుండా అదనంగా డబ్బులు చెల్లించిన ఇలా గంటకు ఆరు నిమిషాల పాటు యాడ్స్ రావడం అనేది దారుణమని ఇది ప్రేక్షకుల సహనానికి పరీక్ష లాంటిది. గంటలో ఆరు నిమిషాలు యాడ్స్ రావడం పై అమెజాన్ ప్రైమ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆరు నిమిషాలు మరీ దారుణం..

ఇండియాలో గంటకు ప్రస్తుతం ఆరు నిమిషాలు యాడ్స్ రాగా అదే యూఎస్ఏ లో ఒక గంట పాటు సినిమా లేదా ఏదైనా షో ప్రసారమవతు 2 నుంచి 3.5 నిమిషాలపాటు యాడ్స్ అనేది వస్తున్నాయి. అయితే యూఎస్ఏ లో కూడా గంటపాటు స్ట్రీమింగ్ అయితే యాడ్స్ రావడం ఆరు నిమిషాలకు పెంచారని తెలుస్తుంది. ఇలా పెద్ద ఎత్తున యాడ్స్ రావడంతో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నవారు గొగ్గులు పెడుతున్నారు. ఈ మాత్రం దానికి మేము డబ్బులు కట్టి కూడా ఏంటి ప్రయోజనం అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.. మరి ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి స్పందనను గుర్తించి అమెజాన్ ప్రైమ్ తమ నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇలాగే కొనసాగితే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే వారి సంఖ్య కూడా తగ్గిపోతుంది అనే చెప్పాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×