BigTV English
Advertisement

OTT Movie : దెయ్యం వేసే స్కెచ్ కి బలయ్యే రివ్యూయర్ … ఓటీటీని దడ దడ లాడిస్తున్న సంతానం సినిమా

OTT Movie : దెయ్యం వేసే స్కెచ్ కి బలయ్యే రివ్యూయర్ … ఓటీటీని దడ దడ లాడిస్తున్న సంతానం సినిమా

OTT Movie : క్రిష్ణమూర్తి, అలియాస్ ‘కిస్సా 47’ తన యూట్యూబ్ ఛానల్‌లో సినిమాలను కటువుగా విమర్శించే ఒక రివ్యూయర్. ఒక రోజు అతని ఫోన్‌ కి ఒక సందేశం వస్తుంది. అందులో ప్యారడైస్ థియేటర్‌లో ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ ప్రత్యేక స్క్రీనింగ్‌కు ఆహ్వానం, రాత్రి 12:00 గంటలకు ఒంటరిగా రా, అనే సందేశం ఉంటుంది. దాని కింద హిచ్‌ కాక్ ఇరుత్యరాజ్ అనే దర్శకుడి సంతకం ఉంటుంది. ఇది పబ్లిసిటీ స్టంట్ అనుకున్న కిస్సా, తన కుటుంబం మరియు స్నేహితురాలితో థియేటర్‌కు చేరుకుంటాడు. ఆ తరువాత స్టోరీ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ? థియేటర్లో ఏం జరుగుతుంది ? మూవీ పేరు ? ఓటీటీ వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

కిస్సా 47 (సంతానం) సినిమా రివ్యూలతో సినీ పరిశ్రమలో భయం రేకెత్తించే యూట్యూబర్. అతని కుటుంబం తల్లి (కస్తూరి శంకర్), తండ్రి (నిజల్గల్ రవి), సోదరి (యాషికా ఆనంద్), స్నేహితురాలు ఆసై హర్షిణి (గీతిక తివారీ) అతని సినిమా పిచ్చికి చిరాకులో ఉంటారు. ఒక రోజు హిచ్‌కాక్ ఇరుత్యరాజ్ అనే దర్శకుడి ఆహ్వానం మేరకు, వాళ్ళంతా ‘ప్యారడైస్’ థియేటర్‌కు వెళతారు. కానీ కిస్సా థియేటర్‌లోకి అడుగుపెట్టగానే, అతని కుటుంబం అదృశ్యమవుతుంది. అతనితో పాటు ఇద్దరు ఇతర రివ్యూయర్లు, వీన్ పీచు బాబు (రాజేంద్రన్), వీన్ పీచు మణి కూడా అక్కడ ఉంటారు. ఇక వీళ్ళంతా ఒక క్రూయిజ్ షిప్‌లో ప్రత్యక్షమవుతారు. అక్కడ హిచ్‌కాక్ ఒక దెయ్యంగా కనిపించి, మీరు తన సినిమా ప్రపంచంలో చిక్కుకున్నారని, బయటపడాలంటే సినిమా క్రెడిట్స్ రోల్ అయ్యే వరకు బతకాలని హెచ్చరిస్తాడు. ఇక ఈస్టోరీ సినిమా లోపల సినిమాలా నడుస్తుంది.ఈ  క్రూయిజ్ షిప్ ఒక ఒక సినిమా సెట్ లాగా ఉంటుంది. ఇందులో కిస్సా తన కుటుంబాన్ని కనిపెడతాడు. కానీ వాళ్ళు కిస్సాని గుర్తించరు.


ఇప్పుడు ఈ షిప్‌లో వింతైన పాత్రలు వస్తాయి. ఒక ముసుగు ధరించిన హంతకుడు, ఒక షిప్ కెప్టెన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) కనిపిస్తారు. షిప్‌లోని ప్రతి మూలలో ఒక సినిమా ట్రోప్ దాగి ఉంటుంది. ఒక్కసారిగా లైట్లు ఆగిపోవడం, గోడల నుండి శబ్ధాలు, అద్దాల్లో కనిపించే భయంకర రూపాలు వీళ్ళని భయపెడతాయి. కథ ముందుకు సాగే కొద్దీ, కిస్సా ఈ సినిమా ప్రపంచంలో దాగిన లొసుగులను కనిపెడతాడు. షిప్‌లోని ప్రతి పాత్ర ఒక పజిల్ ముక్కలా కనిపిస్తుంది. ఒక వైపు, కిస్సా తన కుటుంబాన్ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు, హిచ్‌కాక్ సృష్టించిన ఈ ప్రపంచంలోని భయంకరమైన శక్తులు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. సినిమా క్లైమాక్స్ సమీపిస్తున్న కొద్దీ, షిప్‌లోని వాతావరణం మరింత భయంకరంగా మారుతుంది. కిస్సా ఈ సినిమా దెయ్యం నుండి బయటపడగలడా? తనకుటుంబాన్ని కాపాడతాడా ? హిచ్‌కాక్ రూపొందించిన ఈ కథ అతన్ని శాశ్వతంగా బంధిస్తుందా? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : ప్రేమించిన అమ్మాయినే కిడ్నాప్ చేసే ప్రియుడు … ట్విస్టులతో మెంటలెక్కించే లవ్ స్టోరీ మావా

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ తమిళ కామెడీ హారర్ మూవీ పేరు ‘డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవెల్’ (Devil’s Double Next Level). ఈ సినిమాకి ఎస్. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో సంతానం, సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతిక తివారీ, యాషికా ఆనంద్, కస్తూరి శంకర్, నిజల్గల్ రవి, రెడిన్ కింగ్స్లీ, మోట్ట రాజేంద్రన్ వంటి నటులు నటించారు. 2025 మే 16న థియేటర్లలో విడుదలై ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ZEE5 సొంతం చేసుకుంది. ఇది జూన్ 13 నుంచి ZEE5 ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో అందుబాటులో ఉంది.

Related News

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

Big Stories

×