BigTV English

Kannappa Trailer Review : శివయ్య.. నీదే భారమయ్యా.. ‘కన్నప్ప’ ట్రైలర్‌లో ఇవి గమనించారా? ఏదో మిస్సయినట్లుందే?

Kannappa Trailer Review : శివయ్య.. నీదే భారమయ్యా.. ‘కన్నప్ప’ ట్రైలర్‌లో ఇవి గమనించారా? ఏదో మిస్సయినట్లుందే?

Kannappa Trailer Review : ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కమర్షియల్ కి కేరాఫ్ అడ్రస్ లా ఉండేది. ఇప్పుడు కంప్లీట్ గా తెలుగు సినిమా స్థాయి మారిపోయింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో ఒక సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇదంతా కూడా ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి చిత్రం నుంచి మొదలైంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడు ప్రభాస్ అంత మార్కెట్ ఎక్కడుంది అని అనుకున్నారు చాలామంది, కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రభాస్ మార్కెట్ కాకుండా తెలుగు సినిమా మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ట్రిపుల్ ఆర్, కల్కి,పుష్ప వంటి సినిమాలు తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చూపించాయి. ఇక ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో కన్నప్ప ఒకటి. మంచు ఫ్యామిలీ ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదలైంది.


కన్నప్ప అసలు కథ

కన్నప్ప కథ దాదాపు చాలామందికి తెలిసిందే. ఇప్పుడున్న జనరేషన్ ప్రేక్షకులు కొంతమంది తెలియకపోవచ్చు గాని ఈ కథ బాగా పాపులర్. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా భక్తకన్నప్ప పేరుతో సినిమాను చేశారు. కన్నప్ప గొప్ప శివ భక్తుడు. ఇతను పూర్వాశ్రామంలో తిన్నడు అనే బోయ వంశస్తుడు. అతడు ఒక బోయరాజు కొడుకు. చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో జీవనం సాగించేవాడు. ఒకనాడు అలా అడవిదారి గుండా వెళ్తుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది. అప్పటినుంచీ తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెడుతుండేవాడు.


 

ఒక సారి శివుడు తిన్నడి భక్తిని పరీక్షించ దలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినపుడు శివలింగంలోని ఒక కంటినుంచి రక్తం కార్చడం మొదలు పెట్టాడు. విగ్రహం కంటిలోనుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చాడు. వెంటనే విగ్రహం రెండో కంటినుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది. కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది.

కన్నప్ప ట్రైలర్ రివ్యూ

ఒక తెలియని కథను థియేటర్ కు వెళ్లి ఎక్స్పీరియన్స్ చేయడం కంటే కూడా ఒక తెలిసిన కథను ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు చాలా క్యూరియాసిటీ మొదలవుతుంది. అలానే కన్నప్ప ట్రైలర్ ను కూడా చాలామంది అలానే చూడటం మొదలుపెట్టారు. వాస్తవానికి మంచు ఫ్యామిలీ తీస్తున్న సినిమాల మీద అంతగా అంచనాలు లేవు కాబట్టి ఈ సినిమా ట్రైలర్ చాలామందికి కొత్తగా, మంచిగా అనిపించింది. అలానే మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. కానీ ఒక సినిమా ప్రేమికుడిగా ఈ ట్రైలర్ ని చూసినప్పుడు ఖచ్చితంగా కొద్దిపాటి నిరాశ అనేది కలుగుతుంది.

వీటి పైన శ్రద్ధ తీసుకుని ఉండాల్సిందే 

ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షూటింగ్ న్యూజిలాండ్ లో జరగటం వలన ఈ కథ మొత్తం ఒకచోటే జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక ఇంటర్వ్యూలో కూడా దేవుడు గీసిన అద్భుతమైన పెయింటింగ్ భూమ్మీద ఏదైనా మిగిలింది అంటే అది న్యూజిలాండ్ అని తెలిపాడు మంచు విష్ణు. ఈ సినిమా ట్రైలర్ స్టార్టింగ్ లో పిల్లవాడు మాట్లాడిన డైలాగ్ లో తెలుగు ఇబ్బంది పడుతూ మాట్లాడినట్టు అనిపించింది.

ఇక శివుని పాత్ర కోసం ప్రభాస్ ను తీసుకుంటారని మొదట్లో వార్తలు వచ్చాయి. అక్షయ్ కుమార్ కి శివుని పాత్ర అంతగా సెట్ కాలేదు అనేది కొంతమంది అభిప్రాయం. మెడలో పాము కూడా ఒక ఆర్టిఫిషియల్ ఫీల్ క్రియేట్ చేస్తుంది. తెలుగు డబ్బింగ్ విషయంలో కొద్దిపాటి కేర్ తీసుకొని ఉండి ఉంటే బాగుండేది. టీవీల్లో వచ్చే మహాభారతం వంటి సీరియల్ డబ్బింగ్ లా అనిపిస్తుంది. పూర్తిస్థాయి శివుడు అని ఫీలింగ్ అక్షయ్ కుమార్ ని చూస్తే రావడం లేదు.

చాలామంది ప్రభాస్ ఉన్నాడని ఈ ట్రైలర్ కోసం ఎదురు చూశారు, వాళ్ల సంతృప్తి కోసం కొన్ని షాట్స్ వేశారు. అయితే ప్రభాస్ కనిపించిన ప్రతి సీన్ బ్యాక్గ్రౌండ్ సీజీ అని ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రేక్షకులకి అది సీజీ పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఈ ట్రైలర్ లో చెప్పే డైలాగ్ నిజజీవితంలో కూడా తనకు వర్తిస్తుంది.

వీటన్నిటినీ మించి ప్రేక్షకుడు కథకు విపరీతంగా కనెక్ట్ అయిపోయినప్పుడు దీనిని పెద్దగా పట్టించుకోడు. అలా ఆసక్తితో ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టగలిగితే దర్శకుడుగా ముఖేష్ కుమార్ సింగ్ సక్సెస్ అయినట్లే, అలానే మంచు ఫ్యామిలీకి మంచి హిట్టు పడినట్టే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×