BigTV English

HHVM: వీరమల్లు కొత్త డేట్ వచ్చేసింది… ఈ సారైనా మాట తప్పకుండా ఉంటారా ?

HHVM: వీరమల్లు కొత్త డేట్ వచ్చేసింది… ఈ సారైనా మాట తప్పకుండా ఉంటారా ?

HHVM: ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన చిత్రం ‘ హరిహర వీరమల్లు’ .ఇప్పటికే సినిమా షూటింగ్ కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఈ సినిమా ఎన్నిసార్లు అంటే ఏకంగా 14 సార్లు.. అటు వాయిదా పడడంలో కూడా రికార్డు సృష్టించింది హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా ఏ.ఎం.రత్నం (AM Ratnam) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 12వ తేదీనే విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాలవల్ల వాయిదా పడింది. ఇప్పటివరకు మూడు తేదీలను పరిశీలనలో ఉంచిన మేకర్స్.. ఎట్టకేలకు జూలై 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ తేదీన ఖచ్చితంగా సినిమా విడుదలవుతుందని, ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రాబోతోందని సమాచారం. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు కాస్త ఊపిరి పీలుచుకుంటున్నారు. మరోవైపు ఈ డేట్ కైనా కచ్చితంగా వస్తుందా అంటూ సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు.


ఓటీటీ ప్లాట్ఫామ్ తో క చర్చలు జరిపిన చిత్ర బృందం..

ఇకపోతే నిన్న హైదరాబాదులో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ తో కూడా చిత్ర బృందం చర్చలు జరిపిందట. ఈ మీటింగ్ లోనే విడుదల తేదీని కూడా కన్ఫామ్ చేశారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ట్రైలర్ కట్ జరుగుతోందని, త్వరలోనే ట్రైలర్ కూడా రావచ్చని సమాచారం. మొత్తానికైతే ట్రైలర్ విడుదలయ్యాక ఆ ట్రైలర్ ఎలా ఉందో చూసి, ఆ తర్వాతే సినిమా బిజినెస్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి జూలై 25 అంటూ విడుదల తేదీని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న టీం ట్రైలర్ ను ఎప్పుడు విడుదల చేస్తారు.. ? ఈ ట్రైలర్ తో బిజినెస్ ఏ మేరా జరుగుతుంది? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.


హరిహర వీరమల్లు సినిమా విశేషాలు..

హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే .. 2021 లో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఈ సినిమాను ప్రకటించారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని మరింత అద్భుతంగా తెరకెక్కించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ కరోనా లాక్ డౌన్ రావడం, అటు పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా డేట్స్ ఇవ్వకపోవడంతో.. ఈ సినిమా నుండి క్రిష్ తప్పుకున్నారు. ఆ తర్వాత రంగంలోకి దిగారు జ్యోతి కృష్ణ. ఇక ప్రస్తుతం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పాటలు విడుదల అవ్వగా.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈసారైనా అనుకున్న తేదీకి సినిమాని విడుదల చేస్తారా? రిలీజ్ అయితే ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.

ALSO READ:Ram Charan Peddi: భారీ ధరకు పెద్ది ఓటీటీ రైట్స్.. విడుదలకు ముందే 100 కోట్ల క్లబ్!

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×