Tollywood Industry : సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కాస్త కష్ట పడాలి. అందం అభినయంతో పాటుగా అదృష్టం కూడా ఉండాలి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త వాళ్లంతా కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంటారని చెప్పడం కష్టమే. ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమలోకి కొత్త హీరోయిన్ల ఎంట్రీ ఎక్కువగా ఉంది. కొందరు హీరోయిన్లు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో కొత్త హీరోయిన్ ఎంట్రీకి రంగానికి అంతా సిద్ధం చేశారు. కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఆ హీరోయిన్ బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్ ఎవరో కాదు. స్టార్ క్రికెటర్ భార్య. టీమిండియా యువక్రికెటర్ చాహల్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి ముందు నటిగా, మోడల్ గా ధనశ్రీ సుపరిచితురాలు. అంతకుమించి మంచి డ్యాన్సింగ్ ట్యాలెంట్ ఉన్న బ్యూటీగాను మెప్పు పొందింది. ఇప్పుడు ధనశ్రీ టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేస్తోందని గుసగుస వినిపిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఓ భారీ కథా చిత్రంలో ధనశ్రీ నటిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో కోడై కూస్తుంది. ఈ వార్తలో నిజమేంత ఉందో త్వరలోనే తెలియనిందని టాక్.
ఈమె అందంలో అప్సరసను మించిపోయింది. ప్రతిభ ఉన్న ధనశ్రీ డ్యాన్సులు చూస్తే మతిపోకుండా ఉండదు. డ్యాన్సుల్లో సాయిపల్లవి, శ్రీలీలతో పోటీపడే సత్తా ఈ అమ్మడికి ఉందని అంగీకరించాలి. అంతగా ఇన్ స్టాలో ధనశ్రీ పోస్ట్ చేసిన డ్యాన్సింగ్ వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. స్టూడియోలో కొలీగ్స్ కి చెమటలు పట్టించే రేంజులో స్టెప్పులేస్తోంది. ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఈ మాత్రం క్వాలిటీస్ సరిపోతాయి కదా అని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆమె డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ వీడియో ఎలా ఉందో మీరు చూసేయ్యండి.
ఈమె ఎంట్రీ టాలీవుడ్ లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని అర్థమయింది. ఇక ఏ హీరో సరసన సినిమా చేస్తుంది. డైరెక్టర్ ఎవరు, ఈ బ్యానర్ లో సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈమె ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె ఏ మాత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..