BigTV English

Akkineni Nagarjuna: ఆ విషయంలో నాగ్ ఎప్పుడు కింగే.. తల సినిమాకు సాయం

Akkineni Nagarjuna: ఆ విషయంలో నాగ్ ఎప్పుడు కింగే.. తల సినిమాకు సాయం

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం హీరోగా కాకుండా సపోర్టివ్ రోల్స్ తో బిజీగా మారాడు. హీరోగా చేయాలనుకోలేదా.. ? లేక కథలు లేవా.. ? అనేది తెలియదు కానీ.. నాగ్  ఒక కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. సీనియర్ స్టార్ హీరోలు.. ఎప్పుడు  హీరోగానే సినిమాలు చేస్తున్నారు అన్నవారికి.. నాగ్ ఈ రకంగా ఆన్సర్ ఇచ్చాడు. ఇక ఇదంతా  పక్కన పెడితే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినవారిని ఆదరించడంలో కింగ్ నాగార్జున ఎప్పుడు ముందే ఉంటాడు. కేవలం కింగ్ మాత్రమే కాదు టాలీవుడ్ ఎప్పుడూ కొత్తవారికి ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది. స్టార్స్ వారిని ఇంకాస్తా ఎంకరేజ్ చేయడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయం.


కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డ్యాన్సర్ గా కాకుండా డైరెక్టర్ గా కూడా పనిచేశారని తెల్సిందే. గోపీచంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం రణంకు అమ్మ రాజశేఖరే డైరెక్టర్.   ఆ తరువాత కొన్ని కొన్ని సినిమాలు చేశాడు కానీ,  అవేమి హిట్ కాలేకపోయాయి. ఇక ఇప్పుడు అమ్మరాజశేఖర్ తన కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు.

అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా తల. ఆయనే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అమ్మ రాగిన్ రాజ్ సరసన అంకిత నస్కర్ నటిస్తుండగా.. రోహిత్, ఎస్తేర్, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


Allu Sneha Reddy: అల్లు అర్జున్ పై ట్రోల్స్.. స్నేహారెడ్డి ఆవేదన.. పోస్ట్ వైరల్

వాలెంటైన్స్ డే కానుకగా తల సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. ఇప్పటికే తలపై భారీ అంచనాలున్నాయి. ప్రమోషనల్ కంటెంట్ చూసిన వాళ్లంతా ప్రామిసింగ్ గా ఉందని మెచ్చుకుంటున్నారు. ఇక ఈ చిన్న సినిమాకు సాయంగా అక్కినేని నాగార్జున నిలబడ్డాడు. తాజాగా కింగ్ నాగార్జున బుక్ మై షోలో ఈ మూవీ ఫస్ట్ టికెట్ ను కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా ఆయన ఈ చిత్ర ట్రైలర్ ను చూసి బావుందని, ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

” తల ట్రైలర్ చాలా బావుంది. రాగిన్ రాజ్ పెద్ద హీరో అవుతాడు. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.  నిన్నే ప్రేమిస్తా సినిమాలో గుడిగంటలు మోగిన వేళ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు. అప్పటినుంచి మాకు పరిచయం. అది ఇప్పటివరకు కొనసాగుతూ వస్తుంది. తల రేపు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను” అని తెలిపాడు.

అనంతరం అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. “బుక్ మై షోలో నాగార్జున తల మూవీ ఫస్ట్ టికెట్ ను కొనడం ఈ సినిమా సాధించబోతోన్న పెద్ద విజయానికి చిహ్నం.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నాను. నా కొడుకును ఆదరించండి” అని చెప్పుకొచ్చాడు. మరి నాగ్ సాయం చేసిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×