Nidhi Agarwal: నిధి అగర్వాల్(Niddhi Agarwal).. ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోల సినిమాల్లో భాగమవ్వడంతో ఈ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. అయితే ఇప్పటివరకు ఈ ఇద్దరు హీరోల సినిమాలు విడుదల కాలేదు. కానీ ఆ సినిమాల్లో నటిస్తుందని తెలియగానే ఎంతోమంది దర్శక నిర్మాతలు ఈమెకు తమ సినిమాల్లో నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అయితే నిధి అగర్వాల్ నటించిన సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా ఆమెకు వరుస ఆఫర్స్ రావడం ఖాయం. అయితే చాలామంది హీరోయిన్లు సినిమాల్లోకి వచ్చేముందు అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా నిధి అగర్వాల్ కూడా సినిమాల్లోకి వచ్చే ముందు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసిందట.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ తన సినీ కష్టాల గురించి వివరించింది.
ఇండస్ట్రీలో అవకాశం కోసం రెండేళ్లు కష్టపడ్డాను..
ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను సినిమాల్లోకి దీపికా పదుకొనే(Deepika Padukone)ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చాను. దీపిక పదుకొనేని చూసి నేను కూడా హీరోయిన్ అవుతాను అని మా ఫ్యామిలీతో చెప్పాను. దానికి మా ఫ్యామిలీ ముందు నువ్వు చదువుకో..చదువుకున్నాక సినిమాల గురించి ఆలోచిద్దాం అని చెప్పారు.ఆ తర్వాత మా నాన్న నా సినిమాల పిచ్చి చూసి ఎలాగైనా హీరోయిన్ చేయాలి అని అనుకున్నారు. దాంతో సినిమాల్లోకి వెళ్లడానికి నాకు పూర్తి పర్మిషన్ ఇచ్చేశారు. అలా అవకాశాల కోసం నేను రెండు సంవత్సరాల పాటు ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాను. కానీ ఎవరూ కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. ఇక కొంతమంది దర్శక నిర్మాతలేమో అవకాశం ఇస్తానని చెప్పి రెండు మూడు సార్లు ఆఫీసుల చుట్టూ తిప్పించుకొని, ఆ తర్వాత మీకు ఆఫర్ లేదు అని పంపించేశారు. అలా చివరిగా మైఖేల్ మున్నా సినిమాలో నేను సెలెక్ట్ అయ్యాను.ఆ రోజు 300 మందిని ఆడిషన్ చేయగా అందులో నేను సెలెక్ట్ అయ్యి ఆ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను. అలా ఈ సినిమా చూసి నాకు నాగచైతన్య (Naga Chaitanya) సవ్యసాచి (Savyasachi)లో అవకాశం వచ్చింది.
పవన్ కళ్యాణ్ ప్రియురాలిగా నిధి అగర్వాల్..
ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇక ఈ మధ్యకాలంలో నేను సినిమాలు తగ్గించాను అని చాలామంది నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. దానికి కారణం హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) సినిమానే. ఈ సినిమా ఒప్పుకున్న సమయంలో వేరే సినిమాకు సైన్ చేయకండి అని మేకర్స్ నాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ మూవీ కొద్ది రోజులు షూటింగ్ జరుపుకొని కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఆ టైంలోనే నాకు ది రాజా సాబ్(The Raja Saab) మూవీలో అవకాశం వచ్చింది. దాంతో హరిహర వీరమల్లు మేకర్స్ ని ఆ సినిమాలో చేస్తాను అని అడగగా వాళ్ళు ఓకే చేశారు.అలా ది రాజా సాబ్ మూవీలో కూడా అవకాశం అందుకున్నా.. ప్రభాస్(Prabhas ) సినిమాలో ఉన్న రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.అలాగే హరిహర వీరమల్లు లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రియురాలు ‘పంచమి’ పాత్రలో నేను నటిస్తున్నాను” అంటూ తన సినిమాలకు సంబంధించి మంచి అప్డేట్ ఇచ్చింది నిధి అగర్వాల్ (Niddhi Agarwal)..ఇక నిధి అగర్వాల్ సినిమాల్లోకి రాకముందు ఎన్ని కష్టాలు అనుభవించిందో ఆ ఇంటర్వ్యూలో పంచుకుంది. దీన్ని చూసి అభిమానులు ఒక్క అవకాశం కోసం రెండేళ్లు కష్టపడ్డారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే ఇంటర్వ్యూలో తన తండ్రికి సినిమాలు ఇష్టం లేవని, స్టడీస్ పూర్తయ్యాక బిజినెస్ లో భాగం చేద్దాం అనుకున్నారు. కానీ తనకు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి ఆయనే సినిమాల్లోకి వెళ్ళమన్నారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.