South Africa In T20 World Cup: సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టును దరిద్రం వెంటాడుతోంది. 2023 నుండి ఇప్పటివరకు అటు పురుషుల జట్టు, ఇటు మహిళల జట్టు ఏకంగా నాలుగుసార్లు ఫైనల్ కి అర్హత సాధించి.. నాలుగు సార్లు ఫైనల్ పోరులో ఓడిపోవడమే ఇందుకు కారణం. ఐసీసీ టోర్నీలో ఆరంభ దశలో రాణించడం, ఫైనల్ మ్యాచ్ కి వచ్చేసరికి బోర్లా పడడం సౌత్ ఆఫ్రికా పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు అలవాటైపోయింది. పురుషుల జట్టులో ఇది చాలా సార్లు కనిపించినప్పటికీ.. మహిళల జట్టు కూడా ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడం ఇది మూడవసారి.
Also Read: U19 Women’s T20 World Cup: టీ-20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా..!
పురుషుల, మహిళల జట్లు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ లో ఓడిపోయిన వివరాలను చూస్తే.. 2023 ఐసిసి ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్ లో రెండవ సెమీస్ లో దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్ ని ఆరు పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ లో అడుగు పెట్టింది. ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 137 పరుగులకే 20 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి.. 19 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
ఇక 2024లో సౌత్ ఆఫ్రికా పురుషుల జట్టు తొలిసారి ఫైనల్ కీ చేరింది. సెమీ ఫైనల్ లో ఆఫ్ఘనిస్తాన్ పై ఘన విజయం సాధించి ఫైనల్ కీ చేరిన సౌత్ ఆఫ్రికా.. ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఐసీసీ టి-20 ప్రపంచ కప్ ఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసి.. 7 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఇక 2024 ఐసీసీ ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పై న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఇక లక్ష్యాన్ని చేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 126 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి.. 32 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
Also Read: Rajeev Shukla – Dhoni: రాజకీయాల్లోకి ధోని.. BCCI సంచలన ప్రకటన !
ఇక 2025 ఫిబ్రవరి 2 వ తేదీన మలేషియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాపై.. భారత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. అనంతరం లక్ష్య చేదనలో భారత్ 11.2 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 84 పరుగులు చేసి టార్గెట్ ని పూర్తి చేసింది. ఇలా నాలుగు సార్లు ఫైనల్ లో ఓడిపోయిన సౌత్ ఆఫ్రికా జట్టుని దరిద్రం వెంటాడుతుందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజెన్లు.
South Africa in the last 4 T20 World Cups:
2023 women's – Lost in the Final.
2024 men's – Lost in the Final.
2024 women's – Lost in the Final.
2025 women's U19 – Lost in the Final. pic.twitter.com/908Q61bbTO
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 2, 2025