Horoscope Today : గ్రహాలసంచారంప్రకారంరాశిఫలాలనుఅంచనావేస్తారు. ఏఫ్రిల్ 15న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.
వృషభం: ఆర్థిక పరిస్థితిలో ఆకస్మిక మార్పులు కలుగుతాయి. రుణ యత్నాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. విద్యార్థులకు కొంత సామాన్యంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన ఆలోచనలు అంతగా కలసిరావు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఖర్చులు అదుపులో ఉంచడం మంచిది.
మిధునం: రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. చాలాకాలంగా వేధిస్తున్న రుణ సమస్యలు నుండి బయటపడతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆర్థిక లబ్ది పొందుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు.
కర్కాటకం: ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు తీసుకొని చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఇతరులతో ఉన్న వివాదాల నుండి బయట పడతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అభిమానాన్ని పొందుతారు. నిరుద్యోగులు లభించిన అవకాశాన్ని వదులుకోకూడదు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.
సింహం: ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మేలైన ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశములు అందుతాయి.
కన్య: మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తికాక నిరాశ కలుగుతుంది. ఇతరుల పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ విషయమై అధికారులు నుండి నిందలు పడతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు
తుల: జీవిత భాగస్వామి నుండి ఊహించని సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వస్తు వాహన సౌకర్యాలు పొందుతారు.
వృశ్చికం: ధనదాయం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆకస్మిక విజయం పొందుతారు. స్థిరాస్తి వివాదాల నుండి బయట పడతారు. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
ధనస్సు: సంతాన ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లేని ఆలోచనలు చేసి నష్టపోతారు. ఇతరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది.
మకరం: ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు చేసి లాభపడతారు. అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు లభిస్తాయి.
కుంభం: వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది. రుణ సమస్యల నుండి బయట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.
మీనం: ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఉదర సంభందిత అనారోగ్య సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి.
ALSO READ: గ్రహబాధలు, సమస్యలుపట్టిపీడిస్తున్నాయా? ఈ సింపుల్రెమెడీస్‌తోమీబాధలన్నీపరార్