Nidhi Agarwal : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించింది. రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడంతో ఆమె తెలుగులో బిజీ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆ సినిమా తర్వాత పెద్దగా పిచ్చి సినిమాలు పడలేదు. దాంతో తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తమిళ స్టార్ హీరో శింబు తో ప్రేమలో పడిందని వార్తలు కూడా ఆ మధ్య వినిపించాయి.. దీనిపై ఈమె ఎక్కడ స్పందించలేదు. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ తో గొడవలు అంటూ వస్తున్నా వార్తల పై తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఆ గొడవలకు కారణం ఏంటనే విషయాన్ని బయటపెట్టేసింది..
కాజల్ తో గొడవల పై క్లారిటీ..
నిధి అగర్వాల్, కాజల్ అగర్వాల్ మధ్య గొడవలు జరుగుతున్నాయని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ విషయంపై మాట్లాడింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఇంస్టాగ్రామ్ లో నమస్తే ఫ్రెండ్స్ అనేదానికి మీరు వ్యంగ్యంగా సమాధానం చెప్పారని.. దాంతో మీకు కాజల్ అగర్వాల్ కి గొడవలు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి అందులో నిజం ఎంత ఉంది? అని అడిగారు. దానికి ఆమె సమాధానం చెబుతూ.. నేను ఏ పేజ్ గురించి తప్పుగా మాట్లాడలేదు.. అందరికీ నేను అప్పుడే క్లారిటీ ఇచ్చాను. మీరు తప్పుగా అనుకోని నన్ను తప్పుగా అంటే బాగోదు కదా నేను నా సినిమా గురించి ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటున్నాను. మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని నిధి క్లారిటీ ఇచ్చేసింది.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Also Read : మహాభారతంలో నాని… స్టేజ్ పైనే బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన జక్కన్న..
సినిమాల విషయానికొస్తే..
యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసింది కానీ ఆ సినిమాల మీకు పెద్దగా ఫలితాన్ని అందించలేకపోయాయి. దాంతో తమిళ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిధి అక్కడ వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీలో హీరోయిన్గా నటిస్తుంది.. అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రాజా సాబ్ మూవీలో నటిస్తుంది.. ఈ రెండు సినిమాలు షూటింగుని పూర్తిచేసుకుని త్వరలోనే రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. మే 9న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చినా ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..