Padutha Theeyaga: ..గత వారం రోజులుగా ఎక్కడ చూసినా సరే సింగర్ ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aaradhya) , జడ్జెస్ కీరవాణి (Keeravani), సునీత(Sunitha ), చంద్రబోస్(Chandrabose ), కార్యక్రమం పాడుతా తీయగా(Padutha theeyaga) గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. దివంగత సంగీత దర్శకులు, గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం(SP Bala Subrahmanyam) 1996లో ప్రముఖ టీవీ ఛానల్లో ఈ ‘పాడుతా తీయగా’ అనే కార్యక్రమాన్ని స్థాపించారు.అప్పుడు ఎస్.జానకి వంటి దిగ్గజ గాయకురాలు జడ్జిగా వ్యవహరించేవారు. ఇక అలా నాటి నుంచి 25 సంవత్సరాలుగా నిర్విరామంగా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్న ఈ షోని ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాంతరం ఆయన వారసుడు ఎస్పీ చరణ్ (SP Charan) హోస్టుగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఆస్కార్ గ్రహీత ఎం. ఎం. కీరవాణి (MM Keeravani), ఆస్కార్ గ్రహీత రచయిత చంద్రబోస్ (Chandrabose ) ప్రముఖ సింగర్ సునీత (Singer Sunitha) జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సింగర్ ప్రవస్తి తనకు కార్యక్రమంలో అన్యాయం జరిగిందని , పక్షపాతం చూపించారని ఆరోపణలు చేసింది. అదే కాదు పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ మరి షోలో తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది. అటు కీరవాణి అమ్మాయిలు స్టేజ్ పైకి వస్తే ఏదోలాగా చూస్తాడు అంటూ విస్తుపోయే సంచలన కామెంట్లు చేసిన ఈమె, బొడ్డు కిందకు చీర కట్టుకొని రమ్మని విసిగించేవారు అంటూ అటు ప్రొడక్షన్ టీం పై కూడా కామెంట్లు చేసింది.
కీరవాణిపై పోక్సో కేసు వేయాలి – డైరెక్టర్ గీతాకృష్ణ..
ఇక దీనిపై సింగర్స్ సునీత స్పందించినా.. ప్రవస్తి వేసిన ప్రశ్నలకు మళ్లీ సునీత స్పందించకపోవడం గమనార్హం. ఇకపోతే ఇక్కడ ఆస్కార్ గ్రహిత , సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పై ప్రవస్తి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారగా.. వాటికి మద్దతుగా ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ కూడా చేసిన కామెంట్లు మరింత ఆజ్యం పోసాయి. గీత కృష్ణ మాట్లాడుతూ..” గత ఎనిమిది సంవత్సరాలుగా నాకు కీరవాణి తెలుసు. ప్రత్యేకించి చిన్నపిల్లల్ని మాత్రమే కోరుతాడు. అతడిపై పోక్సో కేసు పెట్టాలి ” అంటూ ఊహించని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇలా గీతాకృష్ణ ఎం.ఎం.కీరవాణి పై కామెంట్ చేయడంతో మరో సంగీత దర్శకుడు కోటి (Koti)రంగంలోకి దిగారు.. మీరు నా ఫేవరెట్ దర్శకుడు.. కానీ కీరవాణిపై సంచలన కామెంట్లు చేశారు. ఇకనైనా ఈ మాటలు ఆపండి అంటూ కోటి ఒక వీడియో రిలీజ్ చేశారు.
ఇకనైనా ఆపండి అంటూ గీతా కృష్ణపై మండిపడ్డ కోటి..
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ..” గీతాకృష్ణ మీరు నాకు ఇష్టమైన డైరెక్టర్. అప్పట్లో కొత్త రకమైన ఆలోచనలతో సినిమాలు చేసేవారు. కె.విశ్వనాథ దగ్గర శిష్యరికం కూడా చేశారు.. కానీ ఈమధ్య మీకు కొంచెం మేటర్ ఎక్కువైంది. కీరవాణి ,చంద్రబోస్, సునీత గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మనమందరం ఒక ఫ్యామిలీ. ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు ..తప్పు జరిగిందా? లేదా? అనేది మీడియా చూసుకుంటుంది. వ్యక్తిగతంగా మనుషులపై ఇలాంటి కామెంట్లు చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్. మీరే ఆలోచించండి.. ప్రతి దానిలో కూడా చిన్న అవాంతరాలు వస్తూ ఉంటాయి. నేను చేసిన వాటిల్లో కూడా వచ్చాయి. కానీ అక్కడితో మర్చిపోయారు. వాళ్లు హ్యాపీగా ఉన్నారు. దీనికి ఇంత రచ్చ అవసరం లేదు. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇక ఈ విషయంలో మీరు ఏది కూడా మాట్లాడకండి. ఇంకా ఏం చెప్తారో ఏం వినాల్సి వస్తోందో అనే భయం వేస్తోంది” అంటూ కోటి వేడుకున్నారు. ఒక ప్రస్తుతం కోటి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.