Rajamouli: ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన హిట్ 3 మూవీలో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ భారీ అంచనాల తో మే 1 నా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆదివారం గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందులో రాజమౌళి కూడా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే హిట్ 1, 2 హీరోలు విశ్వక్ సేన్, అడివి శేష్ గెస్టులుగా రావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఆద్యంతం కలర్ ఫుల్ గా జరిగిన వేడుకలో ఊహించని సర్ప్రైజ్ లు ఇచ్చారు.. ఈ క్రమంలో జక్కన్న నానితో చేయ్యబోయే సినిమాను అనౌన్స్ చేసి అందరిని సర్ ప్రైజ్ చేశాడు..
హిట్ 3..
పక్కింటి అబ్బాయిగా.. ఎప్పుడూ కూల్ గా ఉండే పాత్రలో నటించేది నాని ఇప్పుడు యాక్షన్ హీరోగా మారాడు. దసరా మూవీ తర్వాత నాని లోని మరో కోణాన్ని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. యాక్షన్ సినిమాలలో నాని నటిస్తున్నాడు. ప్రస్తుతం హిట్ 3 మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యం లో నిన్న సాయంత్రం హైదరాబాదు లో గ్రాండ్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు చిత్ర యూనిట్. ఆ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ హాజరయ్యారు. ముఖ్యంగా రాజమౌళి మాటలు ఆ ఈవెంట్ కి హైలైట్ అయ్యాయి. అంతేకాదు ఆయన నాని ఫాన్స్ కి అదిరిపోయే సర్ ప్రైజ్ ను ఇచ్చారు..
Also Read : మే లో సినిమాల సందడి.. ఏకంగా 12 సినిమాలు రిలీజ్..
రాజమౌళి మహాభారతం సినిమాలో నాని ఫిక్స్..
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. దీని తర్వాత రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ అయినా మహాభారతం సినిమా తెరకెక్కించడం అన్న విషయం అందరికి తెలుసు.. గతంలో చాలా ఇంటర్వ్యూలలో ఈ మూవీ గురించి అనౌన్స్ చేశారు. ఈ ఇతిహాసాన్ని వెండితెరపైకి తీసుకొస్తానని గతంలోనూ చెప్పారు. మహాభారతం సినిమాలో నాని పాత్ర ఫిక్స్ అయిందని రూమర్ విన్నాం, ఇది నిజమేనా అని ఈ ఈవెంట్‍లో రాజమౌళిని సుమ అడిగారు. కచ్చితంగా నాని ఉంటాడనేది ఫిక్స్ అని రాజమౌళి చెప్పారు.. మహేష్ బాబు తో రాజమౌళి చేస్తున్న సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. ఈ మూవీ లో మహేష్ ఎలా కనిపిస్తాడో అని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుందని సమాచారం.. ఇక నాని శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో పారడైజ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం..