HBD Anupama Parameswaran : సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ తో కాకుండా పర్ఫామెన్స్ తో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ముందు వరుసలో ఉంటారు. 19 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఇప్పటిదాకా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఫిబ్రవరి 18న అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అంటే ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు దశాబ్దం కావస్తోంది. మరి ఇన్నేళ్లలో ఆమె కూడబెట్టుకున్న ఆస్తులు ఎన్ని? అనే వివరాల్లోకి వెళితే…
అనుపమ పరమేశ్వరన్ ఆస్తులు తెలిస్తే గుండె గుభేల్…
19 ఏళ్ల వయసులోనే ‘ప్రేమమ్’ (Premam) సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో అయితే ‘అఆ’ సినిమాలో అమ్మోరు కత్తిలా కన్పించి, ఆడియన్స్ మనసును దోచుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న ‘ఇది కత్తి కాదు అమ్మోరు కత్తి నాన్నోయ్’ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. దానికి మెయిన్ రీజన్ కూడా అనుపమే. ఆ సీన్ లో ఆమె ఇచ్చే లుక్, ఎక్స్ప్రెషన్ ను ఎప్పటికీ మరిచిపోలేరు ప్రేక్షకులు.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ గా వసూలు చేస్తోందని సమాచారం. సమాచారం ప్రకారం అనుపమకు దాదాపు 35 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ అమ్మడి దగ్గర పలు లగ్జరీ కార్లు, ఓ విలాసవంతమైన భవనం కూడా ఉన్నట్టు సమాచారం. ఇక రొమాంటిక్ సినిమాల్లో నటించాలంటే మాత్రం కాస్త పారితోషకం పెంచి, రూ.1.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందట అనుపమ. అలాగే ఒక్కో యాడ్ కి ఈ బ్యూటీ రూ. 50 లక్షలు డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది.
సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 9 ఏళ్లు అయినప్పటికీ అనుపమకు చాలామంది స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ మాత్రం రాలేదు. ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందుకున్నా ఆమెకు బిగ్ ప్రాజెక్ట్ లలో అవకాశాలు రావట్లేదు. దీంతో అనుపమ మిడ్ రేంజ్, చిన్న సినిమాలతో సరిపెట్టుకుంటోంది. కానీ ఆమెకంటూ సెపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉంది.
అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ లైనప్
ఇప్పటిదాకా అనుపమ పరమేశ్వరన్ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అందులో బ్లాక్ బస్టర్ సినిమాలు అనగానే గుర్తొచ్చేది మాత్రం కొన్నే. ఆ లిస్టులో ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు, 18 పేజీలు, కార్తికేయ 2, టిల్లు స్క్వేర్ వంటి సినిమాలు ఉన్నాయి. ‘టిల్లు స్క్వేర్’ మూవీతో అనుపమ పరమేశ్వరన్ మరోసారి 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పరదా, పెట్ డిటెక్టివ్, బైసన్, డ్రాగన్ (Dragon) వంటి సినిమాలు ఉన్నాయి. ‘డ్రాగన్’ మూవీ ఫిబ్రవరిలోనే రిలీజ్ కాబోతోంది. మిగతా సినిమాలు ఇంకా షూటింగ్ దశలో ఉన్నాయి.