SRH Flag At Himalayas: ఈ ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదారణ పొందిన లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. మరికొద్ది రోజులలోనే ఈ ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇక ఐపీఎల్ 2025 సీజన్ లో అత్యంత ప్రతిష్టంగా ఉన్న జట్టు అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు సన్రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్ లో ఈ జట్టు పటిష్టంగా ఉండడమే కాదు, ముందు నుంచి ఈ జట్టుకి అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే.
Also Read: IPL 2025 – SRH Final: ఫైనల్ కు చేరిన SRH… ఐపీఎల్ చైర్మన్ ప్రకటన ?
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులను పలు సందర్భాలలో స్టార్ క్రికెటర్లు సైతం పొగడడం వినే ఉంటారు. హైదరాబాద్ అభిమానులు ఒక్కసారి ఏ ఆటగాడిదైనా ఇష్టపడడం మొదలుపెడితే.. వారి ప్రేమ వేరే రేంజ్ లో ఉంటుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో ఒకానొక సందర్భంలో హైదరాబాద్ ఫ్యాన్స్ అభిమానం గురించి ప్యాట్ కమీన్స్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ జట్టు అభిమానులు చూపించిన అభిమానం ఎన్నటికీ మరిచిపోలేనని అన్నాడు.
తన జీవితంలో ఇలాంటి క్రేజీ ఫ్యాన్స్ ని చూడలేదని, జట్టు కోసం ఓ నగరమే అండగా నిలవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. హైదరాబాద్ ఫ్యాన్స్ అభిమానం వేరే లెవెల్ అని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ వారి అభిమానం నా మనసును హత్తుకుందని తెలిపాడు. ఇక ఐపీఎల్ 2024 సీజన్ కి ముందు జరిగిన మినీ వేలంలో ప్యాట్ కమీన్స్ ని హైదరాబాద్ 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం అతడికి కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది.
అతడి కెప్టెన్సీలో అసాధారణ ప్రదర్శన కనబరిచిన ఆరెంజ్ ఆర్మీ.. ఫైనల్ చేరి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో ప్యాట్ కమీన్స్ ని 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇక ఆరెంజ్ ఆర్మీ అభిమానుల విషయానికి వస్తే.. తాజాగా ఓ అభిమాని ఏకంగా హిమాలయాలపై సన్రైజర్స్ హైదరాబాద్ జెండాని ఎగరేశాడు. చరణ్ రెడ్డి అనే యువకుడు హిమాలయాలపై SRH జెండాని ఎగిరే వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని హిమాలయాల పర్వత శిఖరం కేదార్ కాంతపై SRH జెండాని ఎగరవేశాడు. దీని ఎత్తు 12,500 అడుగులు { 3,800 మీటర్లు}. ఇది కేదార్ కాంత ఉత్తర కాశీ జిల్లాలోని గోవింద్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉంది. పైన్ చెట్ల అంచులతో, మంచు అందంతో ఉన్న ఈ శిఖరం ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ మంచు ట్రేక్కింగ్ గమ్యస్థానంగా పరిగణించబడుతుంది. ఈ శిఖరం అధిరోహించడానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. ఈ శిఖరం పైకి చేరుకున్న చరణ్ రెడ్డి సన్రైజర్స్ హైదరాబాద్ జెండాని ఎగరవేయడంతో హైదరాబాద్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.