BigTV English
Advertisement

Niharika: మళ్లీ పెళ్లికి సిద్ధమైన మెగా డాటర్.. వరుడు ఎవరంటే..?

Niharika: మళ్లీ పెళ్లికి సిద్ధమైన మెగా డాటర్.. వరుడు ఎవరంటే..?

Niharika : సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఎప్పుడు, ఎవరి ప్రేమలో పడతారో చెప్పడం కష్టం. మరోవైపు ఎప్పుడు, ఎలా బ్రేకప్ చెప్పుకుంటారో కూడా ఎవరికి తెలియదు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇకపోతే మెగా కుటుంబం విషయానికి వస్తే, ఆ కుటుంబం నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. కానీ మెగా డాటర్స్ మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా సక్సెస్ కాలేకపోయారు. మెగా డాటర్స్ వృత్తి పరమైన జీవితంలోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు.


వ్యక్తిగతంగా ఫెయిల్యూర్ అయిన నిహారిక…

ముఖ్యంగా మెగా డాటర్స్ ఇదివరకే పెళ్లిళ్లు చేసుకొని తమ భర్తలకు విడాకులు ఇవ్వడంతో వీరు వార్తల్లో నిలుస్తున్నారు. చిరంజీవి (Chiranjeevi) కుమార్తె శ్రీజ (Sreeja)కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పుడు ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చి, ప్రస్తుతం ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇక మరో మెగా బ్రదర్ నాగ బాబు కూతురు నిహారిక పెళ్లి చేసుకొని భర్తకు విడాకులు ఇచ్చి, ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నిహారిక తొలుత యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ అయింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలా “ఒక మనసు” సినిమా చేసింది. కానీ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది.


మళ్లీ పెళ్లికి సిద్ధమైన నిహారిక…

దీంతో పెద్దల కోరిక మేరకు జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే అబ్బాయిని వివాహం చేసుకుంది. ఇక పెళ్లయిన రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితోనే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రేమలో ఉందనే వార్త హల్చల్ చేస్తోంది. ఈమె ప్రేమకు కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని సమాచారం. ఇక వరుడు కూడా ఇండస్ట్రీకి చెందిన వాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిహారిక ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం నిహారికకు సంబంధించిన పెళ్లి వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నిహారిక సినిమాలు…

నిహారిక నటిగా మారడానికి ముందే ఢీ జూనియర్స్ అనే డాన్స్ రియాల్టీ షో కి యాంకర్ గా వ్యవహరించింది. ఆ తర్వాత ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే షార్ట్ ఫిలింలో కూడా హీరోయిన్ గా చేసింది నిహారిక. ఇక 2016లో విడుదలైన ఒక మనసు సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. చివరిగా సూర్యకాంతం అనే సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత పెళ్లి , విడాకులు అంటూ వ్యక్తిగత జీవితంలో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇక 2023లో డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించిన ఈమె, ఇప్పుడు నిర్మాతగా మారింది. ఇటీవల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ను నిర్మించి , కమిటీ కుర్రాళ్ళు సినిమా తీసి భారీ విజయాన్ని అందుకుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×