Sai Dharam Tej on Pushpa 2 : మరికొన్ని గంటల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “పుష్ప 2” (Pushpa 2) మూవీ థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసలు పుష్పరాజ్ కు మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటుందా? ఉండదా? అన్న సస్పెన్స్ చాలాకాలంగా కొనసాగుతోంది. అల్లు – మెగా కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నాయని, వాటి వల్ల అల్లు అర్జున్ సినిమాకు మెగా ఫ్యామిలీ అందరూ దూరంగా ఉంటూ వస్తున్నారని టాక్ నడుస్తోంది.
సాయి ధరమ్ తేజ్ ట్వీట్…
పైగా హైదరాబాద్ లో నిర్వహించిన ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి (Chiranjeevi)ని గెస్ట్ గా ఆహ్వానించారని, కానీ బన్నీకి సపోర్ట్ చేస్తే మీకు బాయ్ బాయ్ అంటూ అభిమానులు ఇచ్చిన అల్టిమేటం వల్ల ఆయన ఈవెంట్ కి హాజరు కాలేదని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ (Allu Arjun)కు సపోర్ట్ గా ఫస్ట్ ట్వీట్ వచ్చేసింది. మరి ఆ ట్వీట్ కి అల్లు అర్జున్ రిప్లై ఇస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ (Sai Durgha Tej) ట్విట్టర్లో ‘పుష్ప 2’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అంటూ విష్ చేశారు. అందులో అల్లు అర్జున్ పేరుతో పాటు బన్నీ అని కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న మెగా వర్సెస్ అల్లు అనే గందరగోళ పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫస్ట్ ట్వీట్ ఇదే కావడంతో వైరల్ గా మారింది. మరి మిగతా మెగా హీరోలు అల్లు అర్జున్ కి సపోర్ట్ గా ఇలాంటివి ట్వీట్స్ వేస్తారా? లేదా? అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
ఇది సాంప్రదాయమేనా..?
అయితే మరోవైపు సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ ట్వీట్ కేవలం సాంప్రదాయం మాత్రమేనా ? అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ప్రతి వారం సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యే సినిమాలకు ఇలా సోషల్ మీడియా ద్వారా విష్ చేస్తూ ఉంటాడు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా… మూవీ హిట్ కావాలని కోరుతూ ట్వీట్ అయితే వేస్తాడు. మరి ఇప్పుడు ‘పుష్ప 2’ (Pushpa 2) విషయంలో కూడా అదే సాంప్రదాయంతో ట్వీట్ వేశాడా ? అనేది చర్చకు దారి తీసింది.
అప్పుడు అన్ ఫాలో…
ఎలక్షన్ టైంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఆపోజిట్ గా ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అల్లు – మెగా వివాదం మరింతగా రాజుకుంది. సాయి ధరమ్ తేజ్ ఏకంగా ఆ టైంలో బన్నీని ట్విట్టర్లో అన్ ఫాలో చేశారు. ఇప్పటికీ అతను అల్లు అర్జున్ ని ఫాలో కావడం లేదు. కానీ అల్లు శిరీష్ ను మాత్రం ఫాలో అవుతున్నాడు. మరి ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ ‘పుష్ప 2’ మూవీ హిట్ కావాలంటూ చేసిన ట్వీట్ ఒక ఆసక్తికరమైన విషయం అయితే, అసలు అల్లు అర్జున్ ఈ ట్వీట్ కి రెస్పాండ్ అవుతాడా అనేది మరో ఇంటరెస్టింగ్ విషయంగా మారింది.
Wishing all the best to the entire team of #Pushpa2TheRule.
Sending my heartfelt and blockbuster wishes to @alluarjun #Bunny , @aryasukku sir, #FahadhFaasil, @ThisIsDSP , @iamRashmika @resulp @SukumarWritings , @MythriOfficial , and the entire team. 🤗 pic.twitter.com/VMUb4GLvuu
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 4, 2024