Vd14: ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పై మంచి హైప్ ఉంటుంది. అందులో విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ ఒకటి. ఛలో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రష్మికకు మంచి గుర్తింపు లభించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో శ్రీవల్లి పాత్రలో కనిపించింది రష్మిక. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అనిమల్ సినిమా కూడా మంచి హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల పైగా కలెక్షన్స్ కూడా వసూలు చేసింది. ఈ సినిమాలో గీతాంజలి పాత్రలో కనిపించింది రష్మిక. ఈ రెండు సినిమాలు రష్మిక కెరియర్ ను నెక్స్ట్ లెవెల్లో పెట్టాయి.
ఇకపోతే రష్మిక విజయ్ దేవరకొండ కలిసి నటించిన సినిమా గీత గోవిందం. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కానీ ఇప్పటికీ ఈ సినిమాకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలామందికి డియర్ కామ్రేడ్ ఫేవరెట్ ఫిలిమ్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంకా ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది అని చాలా కథనాలు వినిపించాయి. ఇక వీరిద్దరూ త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు. ఈ విషయం గురించి రష్మిక కూడా పుష్ప ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చింది. వీరిద్దరూ కలిసి మరోసారి సినిమా కోసం జతకట్టబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
టాక్సీవాలా సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు రాహుల్. ఆ తర్వాత రాహుల్ చేసిన సినిమా శ్యామ్ సింగ రాయ్. నాని నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం రాహుల్ విజయ్ దేవరకొండతో సినిమాను చేస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. విజయ్ కెరియర్లో 14వ సినిమాకు రాహుల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ హైదారాబాద్ లో మొదలుకానుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎంత మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఇక ప్రస్తుతం విజయ్ గౌతమ్ దర్శకత్వంలో తన 12వ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
Also Read : Pushpa 2 Allu Arjun: ఇదెక్కడి స్కామ్ అండి.? టికెట్స్ అన్నీ అల్లు అర్జున్ తీసుకున్నాడట