Nimrat Kaur : బాలీవుడ్ బ్యూటీ నిమ్రత్ కౌర్ పేరు ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో వినిపిస్తుంది.. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ భర్త, నటుడు అభిషేక్ బచ్చన్ తో ఎఫైర్ సాగిస్తోందనే ప్రచారం నడుమ నిమ్రత్ పేరు బాగా పాపులరైంది.. అయితే ఈ వార్తలపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు కానీ ఈమె పేరు మాత్రం రోజుకో విధంగా వార్తల్లో హైలైట్ అవుతుంది.. ఇక సినిమాల్లో కూడా పవర్ ప్యాక్డ్స్ పెర్ఫామెన్సెస్ తో నిమ్రత్ మంచి పేరు తెచ్చుకుంది.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బాగా పాపులర్ అయిన ఈ హీరోయిన్ గురించి తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సుప్రీంకోర్టులోనే ఆమెకు అన్యాయం జరిగిందంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది మీడియా వర్గాల్లో సైతం ట్రెండ్ అవుతుంది.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
సుప్రీంకోర్టులో నటికి వేధింపులు..
హీరోయిన్లు తమకు చిన్నప్పుడు ఎదురైనా చేదు అనుభవాల గురించి పలు ఇంటర్వ్యూలలో బయట పెడుతూ వస్తున్నారు. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వాటి పై ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ నిమ్రత్ కౌర్ లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని బయటపెట్టింది. తనకు 19 ఏళ్ల వయసులో లా చదువుతున్నప్పుడు ఎస్సి కి వెళ్లాను. సుప్రీంకోర్టు రూమంతా లాయర్లతో జడ్జిలతో నిండిపోయింది. అక్కడ ఉన్న వారందరూ జడ్జి వాదన పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేను కూడా అందులో నిమగ్నమైపోయి వింటున్నాను. ఈ క్రమంలో ఓ చెయ్యి నా మీద వేశారు. నేను వెనక్కి తిరిగి చూస్తే అతను ఒక సీనియర్ లాయర్.. ఆయన దగ్గరనుంచి నేను పక్కకు తప్పుకున్నాను.. కానీ మళ్ళీ చెయ్యి వేయడం మొదలుపెట్టాడు. మొదట కాస్త భయపడ్డాను కానీ ఆ తర్వాత మళ్లీ టచ్ చేయడంతో అతని చెంప చెల్లుమనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయానని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఇది బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..
Also Read : భార్యకు దూరంగా ప్రీతమ్.. విడాకుల వార్తల పై క్లారిటీ..కన్నీళ్లు ఆపుకోలేరు..
భారత దేశం కోసం పోరాడిన నిమ్రత్ తండ్రి..
ఈమధ్య భారత్ పాక్ ల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ యుద్ధంలో ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. ఇప్పుడు ఎలాగైతే యుద్ధం జరిగి ప్రాణాలు పోగొట్టుకున్నారో.. నిమ్రత్ కౌర్ తండ్రి మేజర్ భూపేంద్ర సింగ్ ను 1994లో కాశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. తమ చెరలో ఉంచుకుని దారుణంగా చిత్ర హింసలు పెట్టారు. తమ డిమాండ్లు తీరిస్తేనే ఆయన్నువిడుదల చేస్తామన్నారు. కానీ అప్పట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉగ్రవాదుల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గలేదు. ఇక మేజర్ భూపేంద్ర సింగ్ కూడా ఉగ్రవాదలు చెప్పినట్లు చేయడానికి నిరాకరించారు. దీంతో టెర్రరిస్టులు ఏడు రోజుల పాటు కస్టడీలో ఉంచిన తర్వాత ఆయనను దారుణంగా హత్య చేశారు.. ఆ సమయంలో అతని వయస్సు కేవలం 44 సంవత్సరాలు. నిమ్రత్ కౌర్ వయస్సు 12 సంవత్సరాలు.ఈ విషయాన్ని ఆమె ఇటీవలే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..