India Test Captain| రోహిత్ శర్మ రిటైర్మెంట్ తరువాత టీమిండియా టెస్ట్ క్రికెట్ జట్టుకు ఇప్పుడు నాయకుడు లేడు. పైగా ఇదే సమయంలో టెస్ట్ క్రికెట్ లో అద్భుత ఆటతీరు రికార్డ్ ఉన్న విరాట్ కోహ్లి కూడా టెస్టులకు గుడ్ బై చెప్పేశాడు. ఒకవేళ కోహ్లి ఉండి ఉంటే అతడికైనా కెప్టెన్ పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. కానీ కోహ్లి అనూహ్య నిష్క్రమణతో ఇప్పుడు ఒకవైపు టెస్ట్ క్రికెట్ లో కోహ్లి ప్లేస్ లో ఎవరు ఆడతారు అని ప్రశ్న తలెత్తగా మరోవైపు కెప్టెన్ బాధ్యతలు ఎవరు నిర్వర్తిసారు? అని చర్చ జరుగుతోంది. మరి కొన్ని రోజుల్లో టీమిండియా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లాల్సి ఉంది. ఇంగ్లాండ్ ఆ టూర్ లో 5 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ తరుణంలో నాయకుడు లేకపోవడం టీమిండియాలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 2007 తరువాత ఇండియా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లి విజయం సాధించలేదు. 2007లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో ఇండియా టెస్ట్ సిరీస్ గెలిచింది.
బుమ్రా వర్సెస్ గిల్
టెస్ట్ క్రికెట్ రోహిత్ శర్మ్ లేకపోవడంతో తదుపరి కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా పేరు గట్టిగా వినిపిస్తోంది కానీ కొందరు మాత్రం ఆ పదవికి శుభ్‌మన్ గిల్ సరిగ్గా సరిపోతాడు అని అంటున్నారు. క్రికెట్ ఫ్యాన్స్‌లో ఈ డిబేట్ రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా టెస్ట్ క్రికెట్ మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. ఇప్పుడు ఇండియా టెస్ట్ టీమ్ కు ఆటోమెటిక్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అని చెప్పాడు. కానీ అతను విశ్రాంతి కోరితే శుభ్‌మన్ గిల్ టీమిండియాకు నాయకత్వం వహించాలని అభిప్రాయపడ్డాడు. “జూన్ 20, 2025న ప్రారంభం కాబోయే ముందు బుమ్రా ఆటోమెటిక్ కెప్టెన్, శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్. అతను ఆ బాధ్యతలు స్వీకరించకపోయినా లేకపోతే ఫిట్ నెస్ కారణంగా కెప్టెన్సీ వద్దనుకున్నా.. గిల్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాలి” అని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో రాశాడు. వసీమ్ జాఫర్ ఇండియా కోసం 31 టెస్టులు ఆడాడు.
శుభ్ మన్ గిల్ ప్రస్తుతం ఐపిఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నాడు. మరోవైపు ఐపిఎల్ ఆడుతున్న బుమ్రా, కెఎన్ రాహుల్, రిషభ్ పంత్ లాంటి ప్లేయర్లు కూడా టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. బుమ్రా గతంలో మూడు టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియాలో గత సంవత్సరం బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ టెస్ట్ ని ఇండియా గెలుచుకుంది.ఈ సిరీస్ లో బుమ్రా నాయకత్వం వహించాడు. కానీ ప్రస్తుతం బుమ్రా ఫిట్ నెస్ సమస్యలతో సతమతమువుతున్నాడు. ఇంగ్లాండ్ టూర్‌లో కూడా బుమ్రా అన్ని అయిదు టెస్టులు కూడా ఆడకపోవచ్చనే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియా టూర్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆడిన ఫైనల్ టెస్ట్ మ్యాచ్ లో బుమ్రాకు వెనెముకకు గాయమైంది. దీంతో అతను సెకండ్ ఇన్సింగ్‌లో ఆడలేకపోయాడు.
Also Read: హిజ్రాలతో క్రికెట్ ఆడిన విరాట్ కోహ్లీ !
ఆ గాయం కారణంగా బుమ్రా 2023లో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ తరువాత 2025లో ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా బుమ్రా ఆడలేదు. అయితే 2022లో బంగ్లాదేశ్ లో జరిగిన మూడు టెస్టుల్లో కెఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. టీమిండియా ఇంగ్లాండ్ ఆడేబోయే టెస్టులు ఎడ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ది ఓవల్ లో జరుగునున్నాయి.