Actor Priyatham: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల విడాకులపై వార్తలు రోజుకు వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పటికే ఎంతోమంది గప్చుప్ గానే విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు అటు బుల్లితెరపై ఉన్న సెలెబ్రిటీల పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నేళ్లు కాపురం చేసి పిల్లల్ని కన్న తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇవ్వడమో.. లేదా భార్య భర్తలు దూరంగా ఉండటము జరుగుతుంది. ఇప్పటివరకు ఎంతోమంది విడాకులు ప్రకటించి మరొకరిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి బుల్లితెర హీరో ప్రీయతమ్ చేరారు. ఏంటి ఇతను కూడా విడాకులు తీసుకున్నాడా? అనే అనుమానం కలుగుతుంది కదూ.. తాజాగా తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చి పుల్ స్టాప్ పెట్టేసాడు ప్రీయతమ్.. భార్యకు దూరం అవ్వడానికి గల కారణం ఏంటో? ప్రీతమ్ ఎలాంటి విషయాలను బయటపెట్టారో ఒకసారి తెలుసుకుందాం..
ప్రీయతమ్ – మానస మధ్య విభేదాలకు కారణం ఇదే..?
బుల్లితెరపై మనసు మమత సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు ప్రీయతమ్.. ఆ సీరియల్ ఎంత బాగా సక్సెస్ అయిందో తెలుసు.. అందులో హీరోగా నటించిన ప్రీయతమ్ నటనకు పుల్లు మార్కులు పడ్డాయి.. ఆ సీరియల్ సక్సెస్ అవడంతో అతనికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుసగా అవకాశాలు పలకరించాయి. నాకు సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే బుల్లితెర స్టార్ హీరో అనే పేరు తెచ్చుకున్నారు.. అయితే కెరియర్ పరంగా దూసుకుపోతున్న ఈ హీరో పర్సనల్ లైఫ్ అంతగా బాగాలేదని తెలుస్తుంది. గతంలో ఈయన తన భార్య మానసతో విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వినిపించాయి. ఇప్పటికీ వీళ్లిద్దరూ దూరంగానే ఉంటున్నారు. విడాకులు తీసుకొని విడిపోయారా లేదా మనస్పర్ధలు కారణంగా దూరమైపోయారా అన్నది తెలియడం లేదు. తాజాగా ఈ విషయంపై హీరో ఓ యూట్యూబ్ ఛానల్ లో క్లారిటీ ఇచ్చారు. లైవ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది.
Also Read : వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు.. ఫ్యాన్స్ కు పండగే..
మానస పై నా ప్రేమ చావదు.. ఏం జరిగిందంటే..?
బుల్లితెర హీరో ప్రీతమ్, తన భార్య మానస ప్రస్తుతం దూరంగా ఉంటున్నారన్న విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతమ్ అసలు విషయాన్ని బయట పెట్టాడు.. మీ ఇద్దరి మధ్య అసలు గొడవలు ఎందుకు జరిగాయి..? నీ జీవితంలోకి మరొక అమ్మాయి రావడంతోనే గొడవలు జరిగాయని బయట వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజమెంత అని యాంకర్ ప్రశ్నించాడు.. దానికి ప్రీయతమ్ సమాధానం చెప్పాడు. నాకు మానసకు చిన్న గ్యాప్ వచ్చింది. నేను సీరియల్స్లలో సినిమాలలో బిజీగా ఉండడంవల్ల మా ఇద్దరి మధ్య ఒక చిన్న గ్యాప్ ఏర్పడింది. తనని నేను ఎప్పుడు కాదనుకోవట్లేదు. మేము మా పిల్లల కోసమేనా కలిసి ఉండాలని అనుకుంటున్నాం. నేను ఎన్నోసార్లు తనని అవాయిడ్ చేస్తున్నానని తను ఫీల్ అయింది. అందుకే మా ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది తప్ప మేము ఎప్పుడు గొడవ పడలేదు.. మరో విషయం ఏంటంటే మేము అసలు విడాకులు తీసుకోలేదు అని క్లారిటీ ఇచ్చారు. మానస పిల్లల్ని ఎంత గొప్పగా చూసుకుంటుంది. తనకోసం మా ఇంట్లో వాళ్ళందరం కూడా బాధపడుతున్నాం. ఆ దేవుడు దయ ఉంటే మేము త్వరలోనే కలుస్తామని లైవ్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మీ భార్యను మీరు ఇంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఆమె మీ ప్రేమను తప్పక అర్థం చేసుకుంటుంది త్వరలోనే మీ దగ్గరికి వచ్చేస్తుంది అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రీయతమ్ పాపే మా జీవనజ్యోతి అనే సీరియల్ లో నటిస్తున్నాడు.