BigTV English
Advertisement

OTT Movie : గ్రామంలో గందరగోళంలో సృష్టించే చిట్టి ఎలుక … ఓటీటీలో కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ సినిమా

OTT Movie : గ్రామంలో గందరగోళంలో సృష్టించే చిట్టి ఎలుక … ఓటీటీలో కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ సినిమా

OTT Movie : కేరళలోని ఒక చిన్న గ్రామంలో, రెండు పొరుగు కుటుంబాల మధ్య గొప్ప స్నేహ బంధం ఉంటుంది. కానీ ఒక రోజు ఒక చిన్న ఎలుక వీళ్ళ జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. దాని వల్ల అక్కడ అంతా గందరగోళంగా మారుతుంది. ఈ చిన్న జీవి రెండు కుటుంబాల మధ్య సంబంధాలను పరీక్షకు గురి చేస్తుంది. ఇక జెర్రీని పట్టుకోవడానికి అక్కడ ఒక అడ్వెంచర్ జరుగుతుంది. చివరికి ఈ ఎలుక వెనుక ఒక ఏదైనా రహస్యం ఉందా? ఈ గందరగోళం కుటుంబాలను విడదీస్తుందా, లేక వారిని మరింత దగ్గర చేస్తుందా? ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ కేరళలోని ఒక గ్రామీణ నేపథ్యంలో జరుగుతుంది. ఇక్కడ రెండు కుటుంబాలు .. ఒక కుటుంబం కొట్టాయం నజీర్ నటించిన పాత్ర నేతృత్వంలో, మరొకటి సన్నీ జోసెఫ్ నటించిన పాత్ర నేతృత్వంలో గొప్ప స్నేహ బంధాన్ని ఏర్పరచుకుంటాయి. ఈ కుటుంబాల సభ్యులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తారు. అయితే ఒక రోజు, జెర్రీ అనే ఒక చిన్న ఎలుక ఒక ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అది ఆహారం దొంగిలించడం, వస్తువులను ధ్వంసం చేయడం వంటి చిలిపి చేష్టలు చేసి, ఆ ఇంటిని గందరగోళంలో ముంచెత్తుతుంది. ఈ ఎలుకను పట్టుకోవడానికి కుటుంబ సభ్యులు రకరకాల పథకాలు వేస్తారు.  కానీ జెర్రీ వాళ్ళని తెలివిగా మోసం చేస్తూ తప్పించుకుంటుంది.


ఈ గందరగోళం గ్రామంలోని ఇతరులకు కూడా వ్యాపిస్తుంది. ఇప్పుడు జెర్రీని పట్టుకోవడం ఆ గ్రామానికి సవాల్‌గా మారుతుంది. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య సంబంధాలు పరీక్షకు గురవుతాయి. ఎందుకంటే ఈ సమయంలో ఒక కుటుంబం మరొక కుటుంబం సహాయం కోరినప్పుడు, అహం, అపార్థాలు తలెత్తుతాయి. మధ్యలో ఈ ఎలుక చేసే చిలిపి చేష్టలు, నవ్వు తెప్పిస్తుంటాయి. చివరికి జెర్రీ సృష్టించిన గందరగోళం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? ఈ ఎలుకను గ్రామస్తులు పట్టుకుంటారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : సైకాలజిస్ట్ నే తికమక పెట్టే సస్పెన్స్ థ్రిల్లర్ … సీను సీనుకూ గుండెలు అదరాల్సిందే

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ మలయాళం కామెడీ మూవీ పేరు ‘జెర్రీ’ (Jerry). 2024 లో వచ్చిన ఈ సినిమాకి అనీష్ ఉదయ్ దర్శకత్వం వహించారు. ఇందులో కొట్టాయం నజీర్, రూత్ P జాన్, సన్నీ జోసెఫ్, అబిన్ పాల్, ప్రమోద్ వెలియనాడ్ ప్రధాన పాత్రలు పోషించారు. 1 గంట 56 నిమిషాల రన్‌ టైమ్ ఉండే ఈ సినిమాకి IMDbలో 7.0/10 రేటింగ్ ఉంది. సింప్లీ సౌత్ Simply South ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Related News

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

Big Stories

×