BigTV English

Nithya Menen: ప్రభాస్ ఎవరో నాకు తెలియదు.. ఇంతలా ట్రోల్ చేయాలా.. ?

Nithya Menen: ప్రభాస్ ఎవరో నాకు తెలియదు.. ఇంతలా ట్రోల్ చేయాలా.. ?

Nithya Menen: ఇండస్ట్రీలో కొంతమంది తెలిసి తెలియక చేసే చిన్నతప్పులే వారి పతనానికి కారణం అవుతాయి. కొన్నిసార్లు విమర్శలకు దారితీస్తాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోయిన్లకు.. సినిమాల గురించి, ఎవరు టాప్ హీరోలు అన్న విషయం అప్పట్లో తెలిసేది కాదు. ఇప్పుడు వచ్చే హీరోయిన్లు ముందే పక్కాగా ప్లాన్ చేసుకొని.. ఏ హీరో టాప్ లో ఉన్నాడో కనుక్కొని, ఎవరికి ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉందో తెలుసుకొని ఇంటర్వ్యూల్లో వారి పేరు చెప్పి మార్కులు కొట్టేస్తున్నారు. ఫేమస్ అవుతున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం ఒక స్టార్ హీరోయిన్ గట్టిగా దెబ్బతింది.


మొదటి సినిమా సమయంలోనే ఆమె ఒక స్టార్ హీరో ఎవరో తెలియదు అని తెలిపి విమర్శల పాలైంది. ఇప్పటికీ అదే ఆమె కెరీర్ లో ఎదురుదెబ్బ అని ఫీల్ అవుతుంది. ఆ స్టార్ హీరో ఎవరు.. ? హీరోయిన్ ఎవరు.. ? అనేది తెలుసుకుందాం.

ఇండస్ట్రీలో గ్లామర్ ఒలకబోయకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న హీరోయిన్స్ లో నిత్యా మీనన్ ఒకరు. సౌందర్య తరువాత అంతటి పేరు తెచ్చుకున్న ఈ భామ అలా మొదలైంది సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. నాని హీరోగా నటించిన ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. పెద్ద పెద్ద కళ్లు, రింగు రింగుల జుట్టు చూసి అభిమానులు నిత్యా అందానికి ఫిదా అయ్యారు.


మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ.. తరువాత వరుస సినిమాలతో బిజీగా మారింది. ఏ సినిమా ప్రమోషన్స్ లో అయినా, ఇంటర్వూస్ లో అయినా.. ఒక హీరోయిన్ కు ఎదురయ్యే కామన్ ప్రశ్న.. స్టార్ హీరోల గురించే. అప్పట్లో నిత్యా మీనన్ కు కూడా అదే ప్రశ్న ఎదురైంది. అదే.. ప్రభాస్ గురించి మీ అభిప్రాయం ఏంటి.. ? అని. అప్పుడే టాలీవుడ్ కు పరిచయమైన నిత్యాకు.. టాలీవుడ్ లో స్టార్ హీరోస్ ఎవరు.. ? అనేది అవగాహన లేకపోవడంతో ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అనేసింది. నిత్యా మీనన్ చేసిన ఈ కామెంట్స్ వివాదాస్పదం అయ్యింది. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు.

నిత్యా మీనన్ ని ట్రోల్ చేశారు. అలా ఇలా ట్రోలింగ్ కాదు. నిత్యాకు పొగరు ఎక్కువ అని, ఆమె ఎవరిని లెక్క చేయదు అని.. ఇంకా దారుణంగా తిట్టిపోశారు. ఇక అప్పుడే ఈ చిన్నది రియలైజ్ అయ్యింది. అప్పటికప్పుడే ఆమె.. తన తప్పును సరిదిద్దుకుంది. ట్యాంకు నిజంగా ప్రభాస్ తెలియదని, అందుకే అలా మాట్లాడానని చెప్పుకొచ్చింది. నిజం చెప్పినా తప్పు అంటే తాను చేసేది ఏం లేదని కూడా తెలిపింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఏదో ఒక సమయంలో ఈ వివాదంపై నిత్యా స్పందిస్తూనే ఉంది.

తాజాగా మరోసారి ఈ విషయమై ఆమె మాట్లాడుతూ .. ” అప్పుడు నేను టాలీవుడ్ కి కొత్తగా వచ్చాను. తెలుగు సినిమాలు చూసిందే లేదు. అందుకే ప్రభాస్ గురించి అడిగితే.. నాకు తెలియదు అన్నాను. నేను నిజాయితీగా సమాధానం చెప్పాను. కానీ, ప్రభాస్ ఫాన్స్ నేను చిన్నపిల్లను అని కూడా చూడకుండా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ వలన నేను ఎంతో కృంగిపోయాను. అది నా జీవితంలో జరిగిన పెద్ద ఎదురుదెబ్బ. ఎంత సర్దిచెప్పినా అది నన్ను వెంటాడుతూనే ఉంది. దాని తరువాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతి చోటా నిజాయితీగా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను. నా అమాయకత్వంతో ఆడుకున్నారని అప్పుడే అర్ధం చేసుకున్నాను. అప్పటినుంచి ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడుతున్నట్లు” నిత్యా తెలిపింది.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×