Niti Taylor:యంగ్ బ్యూటీ నీతి టేలర్ (Niti Taylor)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో ‘మేం వయసుకు వచ్చాం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె, ఈ సినిమాలో తనీష్(Tanish) సరసన చాలా అద్భుతంగా ఒదిగిపోయింది. ఇక ఈ చిత్రానికి ‘త్రినాథరావు’ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ తో ‘పెళ్లి పుస్తకం’, ‘లవ్ డాట్ కామ్’ వంటి చిత్రాలలో కూడా నటించింది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ పెద్దగా గుర్తింపు రాకపోయేసరికి హిందీకి మకాం మార్చింది. ‘కైసీ యే యారియాన్’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఫుల్ క్రేజ్ అందుకుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పలు పోస్ట్లతో అమ్మడు కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టిందనడంలో సందేహం లేదు. ఇప్పటికీ కూడా తన అందచందాలతో యువతను ఆకట్టుకుంటూనే ఉంటుంది.
రహస్యంగా పెళ్లి చేసుకున్న నీతి టేలర్..
ఇకపోతే నీతి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2020లో పరీక్షిత్ భవా (Parikshit Bhava) అneyఆర్మీ ఆఫీసర్ ను వివాహం చేసుకుంది. కరోనా సమయంలో వీరి వివాహం కావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. చాలా సింపుల్ గా.. అటు అభిమానులకు తెలియకుండా కాస్త రహస్యంగానే పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత నీతి కూడా ‘నీతి భవా’ గా తన పేరును మార్చుకుంది. మూడేళ్ల పాటు వీరి కాపురం బాగానే ఉన్నా.. గత కొద్ది రోజుల నుంచి మనస్పర్ధలు వచ్చినట్లు సమాచారం. దీంతో నీతి టేలర్ భర్తకి దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు అధికారిక ప్రకటన చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
విడాకుల వార్తలపై హింట్ ఇచ్చిన బ్యూటీ..
దీనికి తోడు విడాకుల రూమర్స్ పై నీతి కూడా హింట్ ఇచ్చిందని సమాచారం. తాజాగా నీతి టేలర్ తన పేరులోంచి భవా అనే పేరును తొలగించి, నీతి టేలర్ అని మళ్లీ ఇంస్టాగ్రామ్ లో తన పేరును పెట్టుకుంది. దీంతో భర్తతో విడాకులు అయినట్లు హింట్ ఇచ్చింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా విడాకుల వల్లే ఈమె తన భర్త పేరును కూడా సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించిందనే చర్చ ప్రారంభమైంది. నిజానికి గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలు తమ భర్తల నుంచి లేదా భర్తలు భార్యల నుంచి విడిపోయేటప్పుడు ముందుగా సోషల్ మీడియా ద్వారానే హింట్ ఇస్తున్నారు. వారికి సంబంధించిన ఫోటోలను తొలగించడం, పేర్లు మార్చడం లాంటివి చేస్తూ అభిమానులలో కూడా కొత్త అనుమానాలు కలిగిస్తున్నారు. ఇక తర్వాత కొంతకాలానికి విడాకులు తీసుకొని వేరుపడుతున్నారు. ఇప్పుడు నీతి టేలర్ కూడా అలాగే ఇంస్టాగ్రామ్ లో పేరు మార్చుకోవడంతో విడాకుల చర్చ తెరపైకి వచ్చింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నీతి అలా చేయడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది అని చెప్పవచ్చు. మొత్తానికి అయితే తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఏం.. ఇప్పటికి అదే క్రేజ్ తో దూసుకుపోతోంది. అందుకే ఈమె మళ్లీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు