IOCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఐటీఐ, ఇంటర్, బీఎస్సీ, డిప్లొమా, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ, బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) లో 200 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 22 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ALSO READ: CISF Recruitment: టెన్త్‌తో 1161 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకున్నారా మిత్రమా..?
నోటిఫికేషన్ పూర్తి వివరాలను సవివరంగా తెలుసుకుందాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 200
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెకెన్సీ వారీగా పోస్టులను చూస్తే..
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు: 80
టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు: 58
ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు: 62
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 22
విద్యార్హత: ఐటీఐ, ఇంటర్, బీఎస్సీ, డిప్లొమా, బీఏ, బీబీఏ, బీకామ్, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://iocl.com/
అప్లికేషన్ లింక్: https://iocl.com/apprenticeships
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 200
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: మార్చి 22
* దరఖాస్తుకు ఇంకా నాలుగు రోజులు సమయం మాత్రమే ఉంది.
ALSO READ: PNB Recruitment: లక్షకు పైగా వేతనంతో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. ఇంకా వారం రోజులే..!