Big Stories

ST SC Atrocity Case on Buggana: అడ్డంగా బుక్కైన మంత్రి బుగ్గన.. అసలేం జరిగింది..?

ST SC Atrocity Case on Buggana: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ రోజున మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఎలా వ్యవహరించారనే దానిపై కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

- Advertisement -

ఈ జాబితాలో తొలుత బుక్కయ్యారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సోమవారం పోలింగ్ రోజున ఏం జరిగిందన్న డీటేల్స్ వెళ్తే.. ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు బుగ్గన.

- Advertisement -

పోలింగ్ సమయంలో ఓ బూత్ వద్దకు బుగ్గనతోపాటు ఆయన అనుచరులు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందనేది కాసేపు పక్కనబెడితే… స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడికి పాల్పడ్డారు. అంతేకాదు తనను కులం పేరుతో దూషించి, తన వాహనాన్ని డ్యామేజ్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై

అసలే ఎన్నికల అమల్లో ఉండడంతో పోలీసులు కూడా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మంత్రి బుగ్గనతోపాటు ఆయన అనుచరులు 30మందిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ మేరకు స్థానిక పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News