Harihara Veeramallu:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకవైపు రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే అండగా నిలుస్తున్న ఈయన, మరొకవైపు అభిమానులను ఖుషీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే మూడు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ వంటి సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్పణలో.. ఏ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించాల్సి ఉండగా..క్రిష్ అనుకోని కారణాల వల్ల తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ (Jyothi krishna ) దర్శకత్వం వహిస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమాకి బయ్యర్స్ కష్టాలు..
అయితే ఇప్పుడు ఈ సినిమాకి కొత్త చిక్కులు ఏర్పడినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాను కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదట. ఈ విషయం తెలిసి అభిమానులు, ఇటు మేకర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి డీసీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న తొలి సినిమా అయినప్పటికీ కూడా.. ఈ సినిమాను కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అందులో భాగంగానే ఈ సినిమా మేకర్స్ మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
హరిహర వీరమల్లు మేకర్స్ మాస్టర్ ప్లాన్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాను కొనుగోలు చేయడానికి బయ్యర్స్ ఎవరు ముందుకు రాకపోవడంతో ‘ఓజీ’ సినిమా మేకర్స్ తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా హక్కులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోవడం వల్లే.. ఈ సినిమా హక్కుల కోసం ఓజి టీం తో పొత్తు పెట్టుకోవడానికి మేకర్స్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ పొత్తు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఏది ఏమైనా దాదాపు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించిన ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి బయ్యర్స్ ఎవరు ముందుకు రాకపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాకి ఏర్పడిన ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో చూడాలి.
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విశేషాలు..
ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రం విషయానికి వస్తే.. సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో డివీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ హీరోగా, ఇమ్రాన్ హస్మి తొలిసారి తెలుగులో నటించబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ సెలెక్ట్ అయినట్లు సమాచారం. ఈ సినిమాకి రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాను గత ఏడాది సెప్టెంబర్ లోనే విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ తోనే హరిహర వీరమల్లు మేకర్స్ పొత్తు పెట్టుకోబోతున్నట్లు సమాచారం.