BigTV English
Advertisement

Daaku Maharaj : నార్త్ లో ‘డాకు మహారాజ్’ దండయాత్రకి డేట్ ఫిక్స్.. దబిడి దిబిడే..

Daaku Maharaj : నార్త్ లో ‘డాకు మహారాజ్’ దండయాత్రకి డేట్ ఫిక్స్.. దబిడి దిబిడే..

Daaku Maharaj : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ. ఒకవైపు మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా మరోవైపు బాక్సాఫీస్ షేక్ అయ్యేలా కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది. నందమూరి ఫ్యాన్స్ కు ఈ సినిమా మాస్ ట్రీట్ అనే చెప్పాలి.. గత కొన్ని లుగా బాలయ్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో హిట్ ట్రాక్ను కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ మూవీ తో కూడా మరోసారి తన ఖాతాలో హిట్ సినిమా పడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లో కూడా డాకు మహారాజ్ సినిమా దుమ్ము దులిపేస్తుంది.. 100 కోట్లకు పైగా రాబట్టింది. ఇక ఇప్పుడు నార్త్ లో దండయాత్రకి రెడీ అవుతుందని తెలుస్తుంది. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..


నార్త్ లో ‘డాకు మహారాజ్ ‘ రిలీజ్.. 

టాలీవుడ్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో  రీసెంట్ గా వచ్చిన మూవీ డాకు మహారాజ్.. ఈ మూవీలో బాలయ్య సరసన జోడిగా ప్రగ్యాస్వాల్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కోసం అభిమానులు కూడా ఓ రేంజ్ లో ఎదురు చూశారు. ఇలా ఫైనల్ గా అంచనాలు అందుకున్న ఈ సినిమాని నెమ్మదిగా తెలుగు సహా ఇతర భాషల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేర్ చేసేలా వసూళ్ల సునామి సృష్టిస్తుంది..  ఇక ఇప్పుడు నార్త్ స్టేట్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు.. హిందీలో ఈ జనవరి 24 నుంచి థియేటర్స్ లో బాలయ్య సందడి చేయనున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. అయితే దీనిపై అభిమానులు హిందీలో ఈ కొంచెం గ్యాప్ లో అయినా ప్రమోషన్స్ చేయాలని కోరుకుంటున్నారు.. తెలుగులో మంచి టాప్ నందుకు ఈ మూవీ హిందీలో ఎలాంటి బజ్ ని క్రియేట్ చేసుకుంటుందో చూడాలి..


డాకు మహారాజ్ కలెక్షన్స్.. 

సంక్రాంతి పండగ బాలయ్యకు బాగా కలిసి వచ్చిందని మరోసారి డాకు మహారాజ్ సినిమాతో ప్రూవ్ అయింది.. మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునే సినిమా కలెక్షన్స్ అని కూడా అంతే రేంజ్ లో రాబడుతుంది. ఈ మూవీ కలెక్షన్స్ ని చూస్తే.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 56 కోట్లు వసూలు చేసింది.. రెండో రోజు రూ.18 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.18 కోట్ల గ్రాస్, నాలుగో రోజు రూ.13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.. కేవలం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. సినిమా కేవలం నాలుగు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం. ఇక ఐదు రోజులకు 125 కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం. ఆరో రోజు తగ్గకుండా 129 కోట్లు వసూల్ చేసింది. ఇక ఏడో రోజు కూడా అంతకు మించి తగ్గకుండా 140 వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఎనిమిదోవ రోజు 161 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసినట్లు తెలుస్తుంది. తొమ్మిదో కూడా 12 కోట్లు వసూల్ చేసిందని టాక్.. ఈ కలెక్షన్స్ గురించి అధికారాక ప్రకటన రావాల్సి ఉంది..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×