BigTV English

Kantara: రిషబ్ శెట్టి మూవీకి షాక్.. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన పంచాయతీ..!

Kantara: రిషబ్ శెట్టి మూవీకి షాక్.. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన పంచాయతీ..!

Kantara.. కన్నడ సినిమాగా వచ్చి అటు యావత్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన చిత్రం కాంతారా (Kantara). ప్రముఖ డైరెక్టర్ గా, నటుడిగా తనలోని విశ్వరూపాన్ని చూపించిన రిషబ్ శెట్టి(Rishab shetty)ఈ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా సంవత్సరాలు గడిచినా.. ఎప్పటికీ ప్రేక్షకుల మధిలో గుర్తుండిపోయే కొన్ని చిత్రాలుఉంటాయి. అలాంటి చిత్రాలలో ఈ కాంతారా కూడా ఒకటి. ముఖ్యంగా తెలిసిన కథే అయినా ఎంతో కొత్తగా చూపించి, తన దర్శకత్వ విలువలతో అందరినీ అబ్బురపరిచారు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఈ సినిమాకి ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మొదటి భాగంలో మనకు ఎన్నో సందేహాలు అలాగే ఉండిపోయాయి. రిషబ్ తండ్రి గురించి, ఆయన చనిపోవడం గురించి, అలాగే ఆ పల్లె సాంప్రదాయాల వెనుక మూలం అసలు ఎక్కడ మొదలైంది? దేవుడు ప్రత్యేకంగా ఒక తెగ వాళ్ళకి మాత్రమే ఎందుకు పూనుతాడు? ఇలాంటి ఎన్నో తెలియని ప్రశ్నలు మనలో మొదలయ్యాయి.ఇక వాటన్నింటికీ సమాధానం తెలియాలి అంటే, ఈ సినిమాకి ముందు ఏం జరిగింది? అనేది తెలిస్తేనే.. మనకు పూర్తి కథ అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆడియన్స్ సందేహాలను క్లియర్ చేయడానికి రిషబ్ శెట్టి ప్రీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


రిషబ్ శెట్టి మూవీకి షూటింగ్ కష్టాలు..

దీని కోసం ఎన్నో కష్టాలు, ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమాకి కొత్త చిక్కులు ఏర్పడినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.
అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమా షూటింగు కర్ణాటకలోని గవిగుడ్డ, హేరూరు వంటి అటవీ ప్రాంతాలలో జరుగుతోంది. అయితే గ్రామ శివారులోని ఖాళీ మైదానాలలో మాత్రమే షూటింగ్ చేసుకోవడానికి అధికారులు అనుమతించారు.


హద్దు మీరిన చిత్ర బృందం.. యువకుడిపై దాడి..

కానీ చిత్ర బృందం మాత్రం అక్రమంగా అటవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తోందట. అంతేకాదు అక్కడ పేలుడు పదార్థాలు కూడా ఉపయోగిస్తున్నట్లు గ్రామ ప్రజలు గమనించారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ కారణంగా అటవీ ప్రాంతంలో ఉండే మూగజీవులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని, చిత్ర బృందాన్ని సంప్రదించి మరీ మందలించారట. అలా వారి ఇద్దరి మధ్య మాట పెరగడంతో గ్రామానికి చెందిన ఒక యువకుడి పై చిత్ర బృందం కాస్త హద్దు మీరు దాడి చేసింది. దీంతో స్థానికులంతా కలిసి పోలీసులను ఆశ్రయించారు.

పోలీస్ స్టేషన్లో చిత్ర బృందం పై స్థానికులు కంప్లైంట్..

యెసలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదవగా.. దీనిపై పోలీసుల త్వరగా స్పందించి చర్యలు తీసుకోకపోతే, తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని కూడా స్థానికులు తెలిపారట. మొత్తానికైతే సినిమా షూటింగ్ తెచ్చిన తంట అటు రిషబ్ మెడకు చుట్టుకోబోతోందని సమాచారం. ఏది ఏమైనా ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని, అటు అభిమానులు కూడా కోరుతున్నారు. మరి కొంతమంది మూగజీవులకు హాని తల పెట్టేలా సినిమా షూటింగ్ లు చేయడమేంటి అంటూ చిత్రబృందం పై మండిపడుతున్నారు. మరి వీటన్నింటికి చిత్రబృందం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×