BigTV English
Advertisement

Pushpa 2 Prasad’s: రేపు రిలీజ్ పెట్టుకుని ఇప్పటికీ తేలని పంచాయతీ

Pushpa 2 Prasad’s: రేపు రిలీజ్ పెట్టుకుని ఇప్పటికీ  తేలని పంచాయతీ

Pushpa 2 Prasad’s : హైదరాబాద్ ప్రసాద్ థియేటర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ థియేటర్లో సినిమా చూడ్డానికి చాలామంది సెలబ్రిటీస్ ఇష్టపడుతూ ఉంటారు. ప్రసాద్ థియేటర్స్ అంటే చాలామందికి ఒక ఎమోషన్. చాలామంది ఇక్కడ సినిమా చూడ్డానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయింది అంటే ప్రసాద్ దగ్గర ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. మామూలుగా పండుగలు ఏడాదికో ఒకసారి వస్తూ ఉంటాయి. కానీ ప్రసాద్ దగ్గర ప్రతి శుక్రవారం పండగలా ఉంటుంది. ప్రసాద్ లో ఒక సినిమా చూస్తున్నప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా పుష్ప 2. ఇదివరకే రిలీజ్ అయిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.


ఈ సినిమా టికెట్ రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయి. అయితే మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. సినిమాను గ్రాండ్ గా నిర్మించింది కానీ రిలీజ్ విషయంలో మాత్రం ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటుంది. ఈ సినిమా విషయంలో ఎక్కడా క్లారిటీ లేకుండా పోయింది. రేపు సినిమా రిలీజ్ పెట్టుకుని ఇప్పటివరకు ప్రసాద్ థియేటర్స్ లో సినిమా ఉంటుందో ఉండదో లేని పరిస్థితి. కానీ ప్రసాద్ థియేటర్స్ యాజమాన్యం మాత్రం పుష్ప సినిమా కోసం ఎదురుచూస్తూనే ఉంది. అయితే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కి ప్రసాద్ యాజమాన్యానికి టికెట్ రేట్స్ అండ్ ప్రాఫిట్స్ విషయంలో డిస్కషన్ జరుగుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ లెక్క ఇప్పటివరకు తేలలేదు. చాలామంది ప్రసాద్ లో టికెట్స్ పెడితే బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ థియేటర్స్ యాజమాన్యం కూడా పుష్ప కోసం సిద్ధంగా ఉంది. లిఫ్ట్ లో బ్యానర్లు, పాప్కార్న్ బాక్స్ లపై పుష్ప రాజ్ ఫోటోలు వైరల్ కూడా అవుతున్నాయి.

ఈ సినిమా ప్రీవియస్ షోస్ నేటి నుంచి మొదలుకానున్నాయి. నేడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అల్లు అర్జున్ అభిమానంతో పాటు రాత్రి 9:30 గంటలకు ఈ సినిమాను చూడనున్నారు. గత మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న సినిమా ఫలితం నేడు తెలియనుంది. ముఖ్యంగా ఈ సినిమా బాహుబలి ట్రిపుల్ ఆర్ వంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది అని చిత్ర యూనిట్ మంచి నమ్మకంతో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన వీడియో కంటెంట్ అంతా కూడా సినిమా మీద హైప్ ను పెంచింది. ఇక ఈ సినిమా ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో నేటితో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ప్రసాద్ థియేటర్స్ విషయంలో ఏం జరగబోతుందో కూడా కొద్దిసేపట్లో తెలియనుంది.


Also Read : Sai Dharam Tej on Pushpa 2 : ఫైనల్‌గా మెగా సపొర్ట్ వచ్చేసింది… మరి బన్నీ రిప్లే ఇస్తాడా..?

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×