IND vs AUS 2nd Test: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియా వేదికగా ఈ టోర్నమెంట్ జరుగుతోంది. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా కు… ఆస్ట్రేలియా గడ్డపై ప్రతి సవాళ్లు ఎదురవుతాయని అందరూ అనుకున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియాపై జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఎవరు ఊహించని రీతిలో విజయాన్ని దక్కించుకుంది టీమిండియా.
ALSO READ: Sachin – Vinod Kambli: ఒకప్పుడు దోస్తులు..మిత్రుడినే గుర్తుపట్టలేకపోయిన కాంబ్లీ..!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లేకున్నా కూడా… మొదటి లిస్టులో విజయం సాధించింది భారత జట్టు. యంగ్ ప్లేయర్లు అలాగే విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్ల సహాయంతో మొదటి మ్యాచ్ లో విజయం అనివార్యమైంది. ఇక మొదటి టెస్టులో విజయం సాధించిన టీమిండియా… రెండో టెస్టులో కూడా విజయం సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్ కు వెళ్లాలని భావిస్తోంది. అయితే రెండో టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు.
రోహిత్ శర్మ కెప్టెన్సీ లోనే టీమ్ ఇండియా రెండవ టెస్ట్ ఆడబోతుంది.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6వ తేదీ నుంచి ఆడిలైడ్ వేదికగా జరగబోతుంది. అంటే ఎల్లుండి నుంచి ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం… ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతుంది. హాట్స్టార్ లో ఈ మ్యాచ్ ను మనం చూడవచ్చు. అయితే రెండో టెస్టుకు రోహిత్ శర్మ, గిల్ అందుబాటులోకి రాబోతున్నారు.
Also Read: Hardik on Ishan Kishan: SRHలోకి ఇషాన్ కిషన్.. అంబానీపై హార్దిక్ పాండ్యా హాట్ కామెంట్స్ !
ఈ ఇద్దరు ప్లేయర్లు వస్తే… కే ఎల్ రాహుల్ పై వేటుపడే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. మొదటి మ్యాచ్లో అద్భుతంగా ఆడిన కేఎల్ రాహుల్ను పక్కకు పెడతారని అంచనా వేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. ఇక అటు విరాట్ కోహ్లీ పైన కూడా వేటు పడే ఛాన్స్ ఉందట. ప్రాక్టీస్ సమయంలో విరాట్ కోహ్లీకి గాయమైనట్లు తెలుస్తోంది. అతని కాలికి పట్టి వేసినట్లు ఉన్న ఓ ఫోటో వైరల్ అయింది. దీంతో రెండవ టెస్టుకు విరాట్ కోహ్లీ తో పాటు కేఎల్ రాహుల్ దూరం కాబోతున్నారని ఈ ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ ఇదే జరిగితే… టీమిండియా కు రెండు ఎదురుదెబ్బలు తప్పవు. ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఆడితేనే టీమిండియా కు ప్లస్ అవుతుంది. ఒకవేళ కోహ్లీకి నిజంగానే గాయం అయితే kl రాహుల్ బరిలో ఉంటాడని కూడా కొంతమంది అంటున్నారు. మరి తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి. ఒకవేళ kl రాహుల్ తో పాటు…విరాట్ కోహ్లీ తుది జట్టులో ఉంటే జట్టు కూర్పు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
IND vs AUS 2వ టెస్ట్: టీం ఇండియా ప్రాబబుల్ XI
రోహిత్ శర్మ (సి)
యశస్వి జైస్వాల్
శుభమాన్ గిల్
విరాట్ కోహ్లీ
రిషబ్ పంత్ ( కీపర్ )
కేఎల్ రాహుల్
వాషింగ్టన్ సుందర్
నితీష్ కుమార్ రెడ్డి
హర్షిత్ రాణా
మహ్మద్ సిరాజ్
జస్ప్రీత్ బుమ్రా