BigTV English

Srikanth odela – Chiranjeevi : నో హిరోయిన్, నో సాంగ్స్, అసలు ఏమి ప్లాన్ చేసావ్ శ్రీకాంత్.?

Srikanth odela – Chiranjeevi : నో హిరోయిన్, నో సాంగ్స్, అసలు ఏమి ప్లాన్ చేసావ్ శ్రీకాంత్.?

Srikanth odela – Chiranjeevi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో శ్రీకాంత్ ఓదెల ఒకరు. దసరా సినిమాలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు శ్రీకాంత్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. నాని కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. నానిని ఎప్పుడు చూపించిన విధంగా ఈ సినిమాలో చూపించాడు. ఇక ప్రస్తుతం మళ్ళీ నానితోనే సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్. ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని వార్తలు కూడా వచ్చాయి. స్వయంగా నాని చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇక మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్టర్ తోనే అంచనాలను పెంచేశాడు శ్రీకాంత్. నానితో ప్యారడైజ్ సినిమా అయిపోయిన తర్వాత, మెగాస్టార్ చిరంజీవితో సినిమా మొదలుకానుంది.


మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ చేయబోయే సినిమా గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీకాంత్ అసలు హీరోయిన్ గా ఎవరిని పెట్టట్లేదు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక పాట కూడా ఉండదు అని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే డాన్సులకు పెట్టింది పేరు. మెగాస్టార్ డాన్సులు చూసి అభిమానులైన వారు చాలామంది ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు అంటే, ఆ రేంజ్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యాన్స్ కోరుకొనే డాన్స్ మూమెంట్స్ కూడా ఉంటాయి అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వాటన్నిటికీ భిన్నంగా పాటలు కూడా లేకుండా ప్లాన్ చేశాడట శ్రీకాంత్. అంతేకాకుండా మెగాస్టార్ లో యాక్షన్ యాంగిల్ కూడా కొన్ని సినిమాల్లో అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇప్పుడు శ్రీకాంత్ అదే ప్లస్ పాయింట్ గా తీసుకొని ఈ సినిమాను ఫినిష్ చేస్తాడు అని తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి ను అభిమానించే దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అందులో శ్రీకాంత్ ఓదెల ఒకరు. మెగాస్టార్ తో సినిమా చేయటం అనేది ప్రతి దర్శకుడికి ఒక కల. చాలామంది దర్శకులు మెగాస్టార్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. ఒక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి నేనూ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి సినిమా చేయబోతున్నాము అని అనౌన్స్ చేశారు. కానీ ఆ ప్రాజెక్టు గురించి ఇప్పటికీ అప్డేట్ లేదు. అలానే పూరి జగన్నాథ్ కూడా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తాడు అని చాలా సందర్భాల్లో వార్తలు వినిపించాయి. ఆ ప్రాజెక్ట్ కూడా సెట్ అవ్వలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కేవలం యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. వశిష్ట తర్వాత అనిల్ రావిపూడి తో మెగాస్టార్ సినిమా చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది.


Also Read : Mahira Khan: రణబీర్ కపూర్ తో ఆ ఫోటో లీక్.. నా కెరీర్ ముగిసిందనుకున్నాను

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×