BigTV English

Salaar : కంటెంట్ నమ్మాలి డూడ్ .. ప్రీ ప్రమోషన్స్ తో పనిలేదు అంటున్న సలార్..

Salaar  : కంటెంట్ నమ్మాలి డూడ్ ..  ప్రీ ప్రమోషన్స్ తో పనిలేదు అంటున్న సలార్..
Salaar

Salaar : టాలీవుడ్ లో విడుదలైన సినిమా చిన్నదైనా పెద్దదైన ముందుగా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చేయకపోతే ఆ సినిమాకి మజా ఉండదు. సినిమా పెద్ద హిట్ కావాలి అంటే కచ్చితంగా భారీగా ప్రమోషన్స్ చేయాలి అని భావిస్తారు చిత్ర బృందం. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ సలార్ మూవీ మాత్రం దీనికి భిన్నంగా కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఎటువంటి గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఏమి చేయకుండానే డైరెక్ట్ గా సలార్ ను విడుదల చేశారు.


సినిమాలో కథ , కథనం సాలిడ్ గా ఉంటే చాలు ప్రమోషన్స్ తో అక్కర్లేదు అనే విధంగా ఈ మూవీ పందా ఉంది. మొదట్లో ప్రీ ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు అని ప్రభాస్ ఫ్యాన్స్ బాధపడ్డారు .కానీ సినిమా చూశాక మాత్రం సాలిడ్ స్టోరీ ఇచ్చినందుకు ప్రశాంత్ ని తెగ పొగడేస్తున్నారు. మూవీ సక్సెస్ కోసం భారీ స్థాయి ప్రమోషన్స్ అవసరం లేదు అని సలార్ ప్రూవ్ చేసింది. దీంతో కంటెంట్ బాగుంటే ప్రమోషన్స్ తో పనేంటి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సలార్ సక్సెస్ సాధించిన ఈ నేపథ్యంలో భవిష్యత్తులో పెద్ద సినిమాలు సైతం కంటెంట్ బాగుంటే భారీ సక్సెస్ సులభమే అన్న టాక్ వినిపిస్తోంది. అనవసరంగా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయడం వల్ల నిర్మాతల పై అవసరం లేని భారం పడుతుంది. ఇలాంటి ఈవెంట్లలో కొన్నిసార్లు ఫాన్స్ మరీ ఎక్సైట్ అయినప్పుడు కొందరికి గాయాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సలార్ పార్ట్ వన్ సక్సెస్ తరువాత ప్రభాస్ నటన పై ప్రశంసల వర్షం కురుస్తుంది. దీనితో పాటుగా రాబోయే పార్ట్ టూ పై అంచనాలు భారీగా పెరిగాయి.


సలార్ 1 స్టోరీ అద్భుతంగా ఉంది.. అయితే పార్ట్ 2 లో మరిన్ని షాకింగ్ ట్విస్టులు ఉండబోతున్నాయని తెలుస్తుంది.ప్రశాంత్ నీల్ ఖాన్సార్ సామ్రాజ్యాన్ని.. దాని చుట్టూ అల్లిన కథ, కథనం.. స్టోరీని మలచిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మిగిలిన డైరెక్టర్లతో పోలిస్తే ప్రశాంత్ నీల్ మూవీ తీసే విధానం ఎంతో వినూత్నంగా ఉంది అని పొగుడుతున్నారు. సలార్ సక్సెస్ తో  డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ పేరు  టాలీవుడ్ లో మోగిపోతుంది. ఈ నేపథ్యంలో ఇకపై రాబోయే చిత్రాలు కూడా ఫ్రీ రిలీజ్ పై అనవసరపు ఖర్చు పెట్టకుండా ఉంటే అన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి పెద్ద సినిమాలు ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తాయేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×