
Game Changer : ఈ సంవత్సరం టాలీవుడ్ టాప్ హీరోస్ అందరూ తమ ఫ్యాన్స్ కి మంచి క్రేజీ అప్డేట్స్ కానుకగా అందించారు. అల్లు అర్జున్ పుష్ప 2, మహేష్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ సలార్, ఎన్టీఆర్ దేవర ఇలా కుర్ర హీరోలు అందరూ సినిమా షూటింగుల్లో తెగ బిజీగా ఉన్నారు. మరోపక్క బాలయ్య ,చిరంజీవి ,నాగార్జున ,వెంకటేష్ ,పవన్ కళ్యాణ్ తమదైన స్టైల్ లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. మిడిల్ టైర్ హీరోలు కూడా పండుగలకు తమ సినిమాలతో సందడి చేస్తున్నారు.ఈ సంక్రాంతికి కుర్ర హీరోలతో పాటు పెద్ద హీరోలు కూడా తమ సినిమాలతో బరిలో దిగుతున్నారు.
అంతా బాగానే ఉంది కానీ రామ్ చరణ్ గత రెండు సంవత్సరాలుగా గేమ్ ఛేంజర్ షూటింగ్ లోనే ఇరుక్కుపోయాడు. ఇప్పటివరకు ఆ మూవీ నుంచి ఒక్క ఫస్ట్ లుక్ తప్ప ఇంకా ఎటువంటి అప్డేట్స్ రాలేదు. కనీసం ఒక టీజర్ కూడా విడుదల కాలేదు. దీపావళికి కలర్ ఫుల్ గా ఉండే చెర్రీ సాంగ్ విడుదల చేస్తాము అని ఆశ చూపించి చివరకు నిరాశ మిగిల్చారు . ఇక దీంతో చిర్రెత్తిన చరణ్ ఫాన్స్ సోషల్ మీడియాలో దిల్ రాజును ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. మరోపక్క ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉండి గేమ్ ఛేంజర్ గురించి పట్టించు కోవడంలేదని డైరెక్టర్ శంకర్ ని కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
ఇక అక్కడితో ఆగకుండా ఈ మూవీ కోసం వెయిట్ చేసే ఓపిక లేదు కనీసం బుచ్చిబాబుతో అయినా సినిమా తీయమని చరణ్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు అతని ఫాన్స్. దిల్ రాజ్ ఫోకస్ పూర్తిగా సంక్రాంతి సినిమాల మీద ఉండగా.. శంకర్ మాత్రం కంప్లీట్ గా ఇండియన్ 2 కి అంకితం అయిపోయాడు. ఈ నవంబర్ లాస్ట్ కి ఎలాగైనా గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలు పెడతాము అని చెబుతున్నా.. చరణ్ ఫాన్స్ మాత్రం ఇండియన్2 మూవీ రిలీజ్ అయ్యేంతవరకు శంకర్ ఈ మూవీని ముట్టుకోడు అని స్ట్రాంగ్ గా వాదిస్తున్నారు.ఇక ప్రస్తుతం బుచ్చిబాబు ఏ మూవీ కమిట్మెంట్ లేక ఫ్రీగా ఉన్నాడు కాబట్టి.. కమల్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న
ఇండియన్2 మూవీ రిలీజ్ అయ్యేలోపు కనీసం బుచ్చిబాబుతో సినిమా స్టార్ట్ చేయమని సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ ని ట్యాగ్ చేసి మరీ రిక్వెస్ట్ పెడుతున్నారు అతని ఫ్యాన్స్. బుచ్చిబాబుతో చేసే ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో మరో రంగస్థలం కావాలని వారు కోరుకుంటున్నారు. మరి రామ్ చరణ్ ఫాన్స్ రిక్వెస్ట్ మేరకు బుచ్చిబాబుతో సినిమా వెంటనే మొదలు పెడతాడో లేదో చూడాలి.