
Train Accident : ఇండియన్ రైల్వేస్‌ను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎస్-1 కోచ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన లోకో పైలట్ రైలుని నిలిపివేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 3 బోగీలు దగ్థమయ్యాయి. 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన యూపీలోని ఇటావా దగ్గర జరిగింది. సిలిండర్ పేలి ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.