TDP cadre attack: పల్నాడులో ఏం జరుగుతోంది? ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న టీడీపీ శ్రేణులు ఎందుకు దాడులకు తెగబడ్డారు? టీడీపీ కేడర్‌ని రెచ్చగొట్టిందెవరు? ఇదంతా వైసీపీ ప్లాన్ ప్రకారమే చేస్తుందా? అసలు పల్నాడులో ఏం జరుగుతోంది? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
ఎన్నికల తర్వాత పల్నాడులో మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో వరద ముంపు ప్రాంతాల పర్యటనకు సిద్ధమయ్యారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు. ఆయనతోపాటు పార్టీకి చెందిన పలువురు వాహనంలో అమరావతి ప్రాంతానికి బయలుదేరారు.
ALSO READ: విజయవాడలో మరోసారి విరిగిపడిన కొండచరియలు.. ఒకరు మృతి
వైసీపీ నేతల పర్యటనను అడ్డుకోవాలని ఆ నియోజకవర్గం టీడీపీ నేతలు పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వెళ్తున్న వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కారుని వేగంగా పోనివ్వడంతో కర్రలతో మాజీ ఎమ్మెల్యే వాహనంపై దాడులకు దిగారు.
పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలు సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ కార్యకర్తలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎట్టకేలకు పోలీసుల జోక్యంతో కార్యకర్తలు శాంతించారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే కారు డ్యామేజ్ అయ్యింది.
ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు అయ్యింది. మాచర్ల, నరసారావుపేట ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో టీడీపీ కేడర్‌ని రెచ్చగొట్టిందెవరు? దీనికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు ఆ ప్రాంత తెలుగు తమ్ముళ్లు.
కొద్దిరోజులుగా ఆ నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. అదును కోసం చూసిన వైసీపీ కేడర్, మంగళవారం ఉదయం వరద ప్రాంతాలను సందర్శించేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న టీడీపీ కేడర్ అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయన్నది దిగువస్థాయి నేతల మాట. దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
వైసీపీ నాయకుల వాహనంపై టీడీపీ దాడి
పల్నాడు జిల్లా అమరావతి మండలంలో ముంపు ప్రాంతాల పర్యటనకు సిద్ధమైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు.
వైసీపీ నేతల పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన టీడీపీ.. శంకరరావు వాహనాలపై దాడి చేసిన టీడీపీ శ్రేణులు.@JaiTDP @ncbn @YSRCParty… pic.twitter.com/JiwE0sOGk0
— BIG TV Breaking News (@bigtvtelugu) September 10, 2024