BigTV English

NTR: నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు ఎన్టీఆర్ శుభాకాంక్షలు..

NTR: నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు ఎన్టీఆర్ శుభాకాంక్షలు..

NTR: ఇండస్ట్రీ నటులకు అవార్డులే ఎంతో గుర్తింపును తీసుకొస్తాయి. నేడు 70 వ జాతీయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. అన్ని భాషల్లో .. అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చినవారికి జాతీయ అవార్డులను అందివ్వనుంది. 2022 కు గాను ఈ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈసారి తెలుగు ఉత్తమ చిత్రంగా కార్తికేయ 2 నిలువగా.. కన్నడలో కెజిఎఫ్, తమిళ్ లో పొన్నియన్ సెల్వన్ 1 నిలిచాయి.


ఇక ఉత్తమ నటుడుగా రిషబ్ శెట్టి.. ఉత్తమ నటిగా నిత్యా మీనన్ జాతీయ అవార్డును అందుకోనున్నారు. దీంతో వీరి పేర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ సైతం విన్నర్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేసాడు.

“ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్న కార్తికేయ 2 చిత్ర బృందానికి మరియు దర్శకుడు చందూ మొండేటికి నా అభినందనలు. అలాగే, దేశ వ్యాప్తంగా జాతీయ అవార్డు గ్రహీతలందరికీ మంచి గుర్తింపు లభించినందుకు నా హృదయపూర్వక అభినందనలు” అని చెప్పుకొచ్చాడు.


ఇక కెజిఎఫ్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “కుడోస్ ప్రశాంత్ నీల్ మరియు యష్.. ఉత్తమ కన్నడ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు KGF2 యొక్క మొత్తం బృందంకు అభినందనలు తెలుపుతున్నాను” అని తెలిపాడు. ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. త్వరలోనే ఎన్టీఆర్ 31 సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక ఈ సినిమాలతో పాటు కాంతార చిత్ర బృందానికి కూడా ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపాడు. “రిషబ్ శెట్టి.. ఉత్తమ నటుడిగా మీరు అర్హులు. మీ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇప్పటికీ నాకు గూస్‌బంప్స్ ఇస్తోంది. అలాగే, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నందుకు కాంతారావు టీమ్ మొత్తానికి అభినందనలు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఎన్టీఆర్ కెరీర్ విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ లాంటి హిట్ సినిమా తరువాత దేవర సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×